900 కోట్ల ఆఫర్ రిజెక్ట్.. పుష్ప 2 టీమ్, మైత్రీ రిస్క్ చేస్తున్నారా?
మన దేశంలో ఆడియెన్స్ సినిమాకి కూడా పెద్ద పీఠ వేస్తారు. నచ్చాలే కానీ మొత్తం పాన్ ఇండియా ఆడియెన్స్ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడతారు. అలా గడిచిన ఈ కొన్నేళ్లలో జరిగిన అనేక మార్పుల్లో పాన్ ఇండియా మార్కెట్ లో సీక్వెల్ సినిమాలు హవా కనబరుస్తున్నాయి. అయితే సీక్వెల్స్ ఎపుడు నుంచో ఉన్నాయి కానీ పాన్ ఇండియా వైడ్ గా అనౌన్స్ చేసిన సినిమాల్లో కొన్ని మాత్రం సక్సెస్ ఫుల్ గా సీక్వెల్ సినిమాకి మంచి హైప్ తెచ్చుకోగలిగాయి.
కాగా అలాంటి సీక్వెల్స్ లో దాదాపు మన సౌత్ సినిమాలు ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలే అధికం అని చెప్పాలి. కాగా ఈ లిస్ట్ లో నెక్స్ట్ రానున్న అవైటెడ్ సీక్వెల్ సినిమా మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ చిత్రం "పుష్ప 2" అని చెప్పాలి. మొదటి భాగానికి ఇప్పుడు సినిమాకి దాదాపు మూడేళ్లు గ్యాప్ ఉన్నప్పటికీ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీనితో ఈ సినిమాపై ఎప్పుడు నుంచో మంచి అంచనాలు నెలకొనగా వీటితో మొదటి నుంచి కూడా 1000 కోట్ల బిజినెస్ అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. వీటికి తగ్గట్టు గానే తెలుగులో హిందీలో ఇంకా ఓటిటిలో కూడా రికార్డు బిజినెస్ ని జరుపుకున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ రాగా ఇప్పుడు ఓ షాకింగ్ రూమర్ బయటకి వచ్చింది.
దీని ప్రకారం ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖులు నుంచి ఏకంగా 900 కోట్ల ఆఫర్ ని అందించారు అట. ఇది నిజంగా ఒక అతిపెద్ద మొత్తం కానీ ఈ భారీ ఆఫర్ ని కూడా మేకర్స్ వద్దని చెప్పేశారట. కాగా ఆ బాలీవుడ్ బిగ్ విగ్స్ పుష్ప అన్ని థియేట్రికల్ హక్కులు, ఓటిటి, ఆడియో కలిపి ఇస్తామని చెప్పారట. అయినా కూడా మైత్రి మూవీ మేకర్స్ అందుకు ఒప్పుకోలేదని వినిపిస్తుంది.

అయితే అసలు ఇంత భారీ ఆఫర్ ని కూడా వారు వద్దు అనుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపడుతున్నారు. ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారా లేక? వాళ్ళకి నమ్మకం లేక వడ్డుకుంటున్నారా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. మరి ఈ రేంజ్ ఆఫర్ వచ్చాక కూడా మేకర్స్ తిరస్కరించారు అంటే పుష్ప 2 ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.
కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అనసూయ, సునీల్ ఫహద్ ఫాజిల్ లు నెగిటివ్ పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి వాయిదా వేసి డిసెంబర్ 6న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం జెనరల్ పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా బెంగాలీలో కూడా విడుదల అవుతుంది. మన టాలీవుడ్ నుంచి ఓ తెలుగు సినిమా బెంగాలీలో విడుదల కానుండడం ఇదే ప్రప్రథమం..


Click it and Unblock the Notifications











