బాలీవుడ్ హీరోతో రాయ్ లక్ష్మీ రొమాన్స్.. కార్ వ్యాన్‌లో ఏం జరిగిందంటే?
దక్షిణాదిలో హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ రకరకాల వార్తలతో మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారుతుంటుంది. తమిళ సినిమా పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార కన్నడ తెలుగు, మలయాళ భాషల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. దక్షిణాదిలోనే కాకుండా హిందీలో కూడా తన మార్కు చాటుకొనేందుకు రాయ్ లక్ష్మీ ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా హిందీలో రిలీజైన బోలా సినిమాలో ప్రత్యేక పాత్రలో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. అయితే బాలీవుడ్ స్టార్‌తో డేటింగ్ చేస్తున్నారనే విషయాన్ని లీక్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రాయ్ లక్ష్మీ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం డేటింగ్ విషయంలోకి వెళితే..
తమిళంలో ఎంట్రీతో సినిమాల్లోకి..: కన్నడ భాషలో వాల్మికీ అనే షార్ట్ ఫిలింలో నటించి మెప్పించిన తర్వాత తమిళంలో కర్కా కసాడరా అనే చిత్రం ద్వారా రాయలక్ష్మీ సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాలోనే గ్లామర్ పంట పండించడంతో ఆమెను వరుసగా సినిమా ఆఫర్లు పలకరించాయి. ఆ తర్వాత కుంక్క మందక్క, ధర్మపురి, నెంజై థోడు అనే చిత్రాల్లో తనదైన నటనతో రాణించి.. స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ : తమిళంలో వరుస ఆఫర్లు అందుకొంటున్న సమయంలో కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా రాయలక్ష్మీ తెలుగులోకి ప్రవేశించింది. ఆ తర్వాత నీకు నాకు, అధినాయకుడు, బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆనందభైరవి చిత్రంలో నటిస్తున్నది.
హిందీలో అజయ్ దేవగణ్‌తో బోలా :
ఇలా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో జోష్‌తో ముందుకెళ్తున్న సమయంలో నగ్మా జీవిత కథ అంటూ పుకార్లు వచ్చిన జూలీ 2 సినిమా ద్వారా హిందీలో నటించింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. కానీ ఇటీవల తమిళంలో విజయవంతమైన ఖైదీ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన అజయ్ దేవగణ్ చిత్రం బోలా అనే చిత్రంలో నటించింది.

బోలా సినిమాలో పాన్ దుకాణియా అంటూ : బోలా సినిమాలో రాయలక్ష్మీ అందాల అరబోతకు హద్దే లేకుండా పోయిందనేది ప్రేక్షకుల అభిప్రాయం. అజయ్ దేవగణ్‌తో కలిసి పాన్ దుకాణియా అనే స్పెషల్ సాంగ్‌లో హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టింది. పాన్ దుకాణియా పాట యువతకు గిలిగింతలను పెట్టింది. పాన్ దుకాణియ పాటకు హిందీలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటలో ఆమె నృత్యానికి, అందాల ఆరబోతకు ప్రేక్షకుల ఫిదా అయ్యారు.
రాయ్ లక్ష్మీపై అజయ్ దేవగణ్ మోజు :
అయితే అజయ్ దేవగణ్‌తో పర్సనల్ రిలేషన్ కారణంతోనే రాయ్ లక్ష్మీ బోలా చేసింది. బోలా సినిమా షూటింగు సమయంలో అజయ్, రాయలక్ష్మీకి మధ్య ఘాటైన రొమాన్స్ నడిచింది. షూటింగ్ జరిగిన రోజుల్లో వ్యానిటీ వ్యాన్‌లో వారిద్దరి రొమాంటిక్ లీలల గురించి యూనిట్ సభ్యులు కథలు కథలుగా చెప్పుకొన్నారు. బోలా సినిమా పూర్తయిన తర్వాత కూడా రాయలక్ష్మీ పై ఇంకా మోజు పడుతున్నాడు. అయితే అజయ్‌తో ఉన్న రిలేషన్‌షిప్ కారణంగానే బోలా సినిమాలో పాన్ దుకాణియా పాటలో ఉచితంగా నటించింది అని ప్రముఖ క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది.
ధోనితో కూడా ప్రేమాయణం
ఇదిలా ఉండగా, రాయల్ లక్ష్మీ గురించి అఫైర్ వార్తలు రావడం ఇది కొత్త కాదు. గతంలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో చాలా కాలం రిలేషన్‌షిప్ కొనసాగింది. ధోనితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. వారిద్దరూ పెళ్లి చేసుకొనే ఆలోచనల్లో ఉన్నారనే వార్తలు కూడా మీడియాలో గుప్పుమన్నాయి. అయితే వారిద్దరి మధ్య డేటింగ్ వార్తలు వస్తున్న సమయంలోనే ధోని, రాయలక్ష్మి విడిపోయారు. అయితే ధోనితోనే ఎందుకు లింక్ పెడుతున్నారు.. మరో నలుగురు కూడా ఉన్నారని విషయాన్ని ఎందుకు అడగరు అని రాయ్ లక్ష్మీ ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











