రామ్ చరణ్ 'రచ్చ'పై దుష్ష్రచారం?
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఆడియో మొన్న అదిరిపోయే రేంజిలో జరిగిన సంగతి తెలిసిందే. అలాగే విడుదలైన పాటలు సైతం అద్బుతమైన టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై దుష్ప్రచారం మొదలైంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ డిజాస్టర్ చిత్రం శక్తితో పోలుస్తూ ప్రచారం జరుగుతోంది. రచ్చ మరో శక్తి తప్ప మరొకటి కాదని రూమర్స్ స్పెడ్ చేస్తున్నారు. ఇది రామ్ చరణ్ అబిమానులను భాధిస్తోంది. ఈ చిత్రం కేవలం పూర్తి మసాలా కూరిన చిత్రమేనని,ట్రైలర్స్ సైతం సరిగ్గా లేవంటూ కొందరు యధాశక్తి చిత్రాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అన్ని వర్గాలనుంచి వచ్చిన ట్రైలర్ రెస్పాన్స్ మేకర్స్ ని ఆనందపరుస్తోంది.
అలాగే రచ్చ టైటిల్ సాంగ్ రిలీజ్ కు ముందే క్రేజ్ క్రియేట్ చేయటం వారికి ధీమా పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రత్యేకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టి మరీ ఫైట్స్ రూపొందించారు. ఆ ఫైట్ కోసం చరణ్ డూప్ ని కూడా పెట్టుకోకుండా తానే నటించాడని,ఆరెంజ్ తర్వాత వస్తున్న ఈ చిత్రం తన కెరీర్ కి ప్లస్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇక మెగా సూపర్‌గుడ్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. వందశాతం మాస్ చిత్రమిదని, కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.
అలాగే ఈ చిత్రంలో కొత్త లుక్ తో కనిపించటంకోసం మియామి వెళ్ళి అక్కడ వర్కువుట్స్ చేసి వచ్చారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం చిరంజీవి ఎనభైల నాటి మాస్ సినిమాలా అలరిస్తుందంటున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











