SSMB29: ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్.. అదే ఇప్పుడు మహేష్‌తో? జక్కన్న ఏకంగా 2028 వరకూనా?
దాదాపు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా కొన్ని కాంబినేషన్ లు అయితే ఆడియెన్స్ లో పిచ్చ క్రేజ్ తెచ్చుకుంటాయి. కాగా ఇది దాదాపు హీరో మరియు దర్శకుడు కాంబినేషన్ పైనే ఉంటాయి. ఆల్రెడీ అప్పటికే పలు సినిమాలు చేసి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ కానీ లేదా ఎన్నో ఏళ్ళు నుంచి ఈ ఇద్దరి మధ్య సినిమా పడాలి అని కోరుకునే సెన్సేషనల్ కాంబినేషన్ కానీ ఇలాంటి క్రేజ్ ని తెచ్చుకుంటాయి. మరి ఇందులో రెండో రకమైన కాంబినేషన్ కోసమే ప్రపంచ సినిమా ఎదురు చూస్తుంది అని చెప్పడంలో డౌట్ లేదు.
మరి ఆ కాంబినేషన్ నే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిల కాంబినేషన్ అని చెప్పాలి. ఈ ఇద్దరి నడుమ కాంబినేషన్ దాదాపు 15 ఏళ్ళు కితమే అనుకుంటూ వస్తున్నారు కానీ సినిమా సెట్ అవ్వలేదు. ఫైనల్ గా రాజమౌళికి గ్లోబల్ ఫేమ్ రావడం, మహేష్ బాబు ఇంటర్నేషనల్ ఎంట్రీ లెవెల్లో చూడాలి అనుకునేవారి కోరిక ఇప్పుడు నెరవేరనుండడం అనేది ఒక క్రేజీ అంశంగా మారింది అని చెప్పాలి.

కాగా వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యింది. మహేష్ బాబు ఆల్రెడీ లుక్ కూడా మార్చేశాడు స్క్రిప్ట్ పనులు ఇంకా జరుగుతున్నాయి కానీ అసలు సినిమా ఎపుడు పట్టాలెక్కుతోంది అనేది చాలా నెలల తరబడి ఒక అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో ఉంటుంది అని ఆల్రెడీ జక్కన్న కన్ఫర్మ్ చేసాడు. మరి జక్కన్న సినిమాలు అంటే ఇప్పుడు ఏళ్ళు తరబడి తీయాల్సిందే..
ప్రేక్షకులు సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే అంటూ ఒక టైం లైన్ డిసైడ్ అయ్యిపోయింది. ఇలానే ఇప్పుడు మహేష్ బాబుతో ప్లాన్ చేసిన రిలీజ్ ఏకంగా 2028 లో అవుతుంది అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఈ చిత్రానికి పని చేస్తున్న విజువల్ టీం ఆర్టిస్ట్ టిపి విజయన్ పెట్టిన స్టోరీ మహేష్ ఫ్యాన్స్ కి గుబులు పుట్టించింది. రాజమౌళి మహేష్ ల సినిమా 2028లో రిలీజ్ అవుతుంది అంటూ.. ఈ ఇన్నేళ్ల గ్యాప్ ఖచ్చితంగా వర్త్ గా నిలుస్తుంది అని పోస్ట్ చేశారు.

దీనితో ఇంకో నాలుగేళ్లు పాటు ఈ సినిమా కోసం ఆగాలి అనే మాటే మహేష్ అభిమానులకి లవ్ బ్రేకప్ కంటే ఎక్కువ బాధని కలిగిస్తుంది. ఇక దీనితో పాటుగా ఈ సినిమా గతంలో రాజమౌళి మరో హీరోతో అనుకోని ఆపేసిన ప్రాజెక్ట్ అని అదే ఇప్పుడు మహేష్ కోసం మార్పులు చేసి ప్లాన్ చేస్తున్నారు అంటూ ఇంకో వెర్షన్ వినిపిస్తుంది. కొన్నేళ్ల కితం బాహుబలి తర్వాత ఎన్టీఆర్ తో జక్కన్న భారీ ప్రాజెక్ట్ "గరుడ" అనే సినిమా చేయాల్సి ఉంది.
కానీ ఇది అప్పట్లో బడ్జెట్ సమస్యలు మూలాన ఆపేసారు అని పలు వదంతులు ఉన్నాయి. కాగా ఇప్పుడు అదే సినిమాని మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నారు అంటూ కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంతే కాకుండా రాజమౌళి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. గరుడ సినిమా ఎప్పటికీ నా మైండ్ లోనే ఉంటుంది. తప్పకుండా చేస్తాను అంటూ తాను చెప్పిన ఓ ఓల్డ్ స్టేట్మెంట్ ని కూడా వైరల్ చేస్తున్నారు. ఇలా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అదే అంటూ షాకింగ్ బజ్ అయితే ఇపుడు మొదలైంది. మరి ఆ సినిమానే ఈ సినిమానా లేక మరొకటా అనేది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











