Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో రాజశేఖర్‌పై విలన్ ముద్ర.. రాజమౌళి టీమ్ మాస్టర్ ప్లాన్!
టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ వరుస సినిమాలతో జోష్ మీద ఉన్నారు. గరుడ వేగ లాంటి భారీ సక్సెస్‌తో మళ్లీ ట్రాక్ మీదకు వచ్చారు. కల్కి సినిమాలో నటిస్తున్న రాజశేఖర్ ఓ విభిన్నమైన పాత్రల కోసం చూస్తున్నారట. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన ఓ సినిమాలో ఆయన విలన్‌గా చేసేందుకు సిద్ధమయ్యారట. రాజశేఖర్ విలన్ పాత్రలో నటిస్తున్నారనే వార్త టాలీవుడ్లో చర్చకు దారి తీసింది.. వివరాల్లోకి వెళితే..
ఆకాశవాణి మూవీలో
ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా ఆకాశవాణి అనే చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని సొంత బ్యానర్లోనే కార్తికేయ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా కీలకమైందట.
హీరో మోహన్ లాల్‌ను అనుకొని
ఆకాశవాణి సినిమాలోని విలన్ పాత్ర కోసం మోహన్‌లాల్ అయితే భావించారట. అయితే బడ్జెట్, ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత రాజశేఖర్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. కార్తీకేయ, దర్శకుడు అశ్విన్ గంగరాజు చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన రాజశేఖర్ ఆ పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
రాజశేఖర్ ‘కల్కి' కోసం 2 కోట్లతో సెట్.. 1980 నాటి తెలంగాణ..
నేను విలన్ పాత్రలకు ఓకే
గతంలో నందమూరి బాలకృష్ణ హాజరైన గరుడ వేగ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు హీరో పాత్రనే చేయాలని లేదు. అయితే బాలకృష్ణతో కలిసి నటించాలని ఉంది. ఒకవేళ బాలయ్య హీరో అయితే నేను విలన్‌గా నటించడానికి సిద్దమని చెప్పారు. కథ, పాత్ర బాగుంటే ఏ పాత్రలోనైన నటించడానికి సిద్ధమని అన్నారు.
డాక్టర్ రాజశేఖర్ విలన్‌గా
ఇక ఆకాశవాణి రూపంలో రాజశేఖర్‌కు విలన్ పాత్ర దక్కినట్టు సమాచారం. అయితే అధికారికంగా వార్త బయటకు వస్తే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు రాజమౌళి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తారు.
కల్కిగా హీరో రాజశేఖర్
ఇదిలా ఉండగా, గరుడు వేగ తర్వాత ఆలోచించిన రాజశేఖర్ కల్కి సినిమాను ఒప్పుకొన్నారు. హీరో నాని నిర్మాతగా మారి రూపొందించిన అ! సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజై ఆకట్టుకొన్నది. త్వరలోనే కల్కి ప్రేక్షకుల ముందుకు రానున్నది.