Jailer జైలర్‌లో రజనీకాంత్ పాత్రను హాలీవుడ్‌ మూవీ నుంచి కాపీ కొట్టారా? ఆ సినిమా పేరు ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం జైలర్. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఆగస్ట్ 2 తేదీన విడుదలైంది. క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఉన్న ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త వివరాల్లోకి వెలితే..

జైలర్ సినిమా ట్రైలర్ రిలీజ్‌ తర్వాత ఆ సినిమా హాలీవుడ్‌ సినిమాకు ఆధారం అనే వార్త కనిపించింది. హాలీవుడ్‌లో అద్బుతమైన విజయాన్ని అందుకొన్న నోబడీ (Nobody) అనే సినిమాను స్పూర్తిగా తీసుకొని నిర్మించారు. పూర్తిగా ఆ సినిమా కథతో జైలర్ రూపొందించారనే వార్త వినిపించింది.

 Is Rajinikanth role of Jailer inspired from Breaking Bad movie from Hollywood?

Nobody మూవీలో తన ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి.. తన కూతురు బొమ్మను లాగేసుకొన్న దుండగులకు ఓ రిటైర్డ్ ఎఫ్‌బీఐ అధికారి ఎలా బదులు చెప్పారనే కథతో తెరెక్కింది. జైలర్ కూడా అలాంటి కథతో రూపొందిందనే విషయం ట్రైలర్ రిలీజ్ తర్వాత అలాంటి వార్తలు వచ్చాయి.

జైలర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్‌ను బ్రేకింగ్ బ్యాడ్ అనే అమెరికా చిత్రంలోని మైక్ ఎహార్ మాన్ ట్రాట్ అనే నటుడు నుంచి తీసుకున్నారు. అయితే జైలర్ మూవీ ట్రైలర్‌లో టైగర్ ముత్తువేల్ పాండియాన్‌గా పరిచయం కానున్నారు. సినిమాలో రజనీకాంత్‌కు, మైక్ పాత్రలకు కొన్ని పోలికలు ఉన్నాయి అని కొందరు విశ్లేషిస్తున్నారు.

 Is Rajinikanth role of Jailer inspired from Breaking Bad movie from Hollywood?

బ్రేకింగ్ బ్యాడ్ మూవీలో మైక్ ఒక అవినీతి పరుడైన ఓ పోలీస్ అధికారి.. అలాగే జైలర్ సినిమాలో కూడా రౌడీలను అణిచివేసే ఓ పోలీస్ అధికారిగా నటించారు. ఈ ఇద్దరి పాత్రల్లో వారు తమ కుటుంబాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ చిత్రంలో రజనీకాంత్ తన మనవడిని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలే సినిమాలో చూపించారు. అందుకు ఒక ముఠాను ఏర్పాటు చేస్తాడు అంటూ వార్తల్లో పేర్కొంటున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న జైలర్ చిత్రంలో రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ యోగి బాబు, మర్నా మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా పంద్రాగస్టు కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X