రామ్ గోపాల్ వర్మ రౌడిలు రామ్ చరణ్, అల్లు అర్జున్..?
రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ బెజవాడ రౌడీలు. తాజాగా తెలుగుదేశం లీడర్ చలసాని పండు హత్య, రౌడీ ప్యాక్షనిజం వార్తల్లో ఉండటంతో ఈ న్యూస్ రామ్ గోపాల్ చలసాని పండు హత్య, రౌడీ ఫ్యాక్షనిజం వార్తల్లో ఉండటంతో ఈ న్యూస్ రామ్ గోపాల్ వర్మ ఎనౌన్స్ చేసారని అంతా భావిస్తున్నారు. ఇక తన చిత్రం విజయవాడ రౌడీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుందని ఆయన అంటున్నారు. అప్పలరాజు చిత్రం పూర్తవగానే ఈ చిత్రం ప్రారంభిస్తానంటున్నారు. ఇక గతంలోనూ విజయవాడ కాలేజీ పాలిటిక్స్ నేపద్యంలో శివ చిత్రం రూపొందించి ఘన విజయం సాధించారు వర్మ.
తను ఎంతో కాలంగా కష్టపడి పక్కాగా స్క్రిప్టు సిద్ధం చేసుకున్న 'బెజవాడ రౌడీలు" చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో తీస్తే ఎలా ఉంటుందని ఆయన తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు భోగట్టా. ఈ చర్చల్లో మరో ఆసక్తికరమైన విషయం ఇంకోటి చోటుచేసుకున్నదట. అదేంటయా...అంటే, బెజవాడ రౌడీల్లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఉండాలి కనుక రామ్ చరణ్ ప్రత్యర్థిగా అల్లు అర్జున్ ను నటింపజేస్తే చిత్రంపై మరింత క్రేజ్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట.


Click it and Unblock the Notifications











