బన్నీలా సేమ్ టు సేమ్ రామ్ చరణ్ కూడా సీన్ క్రియేట్ చేస్తున్నాడా..!

By Sindhu

మొన్న ఆరో తేదీన అంగరంగ వైభవంగా తన ప్రియసఖి స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న అల్లు అర్జున్ ఈరోజు (మార్చి 8) హైదరాబాదులోని శిల్పకళావేదికలో తన అభిమానులకు గ్రేండ్ లెవెల్ లో రిసెప్షన్ ఇచ్చాడు. ఈ వేడుకకు మెగా అభిమానులు రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఓ తమాషా సంఘటన చోటుచేసుకుంది.

అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతుండగా అభిమానులు చరణ్ పెళ్లి గురించి అడిగారు. దాంతో చేతిలోని మైక్ ని చరణ్ కిస్తూ, 'నీ పెళ్లెప్పుడంటున్నారు?' అంటూ నవ్వుతూ అడిగాడు అర్జున్. దానికి పక్కనున్న తండ్రిని చూపిస్తూ, 'నాన్నగారు ఎప్పుడంటే అప్పుడు' అన్నాడు చరణ్. వెంటనే చిరంజీవి మైక్ అందుకుని, నవ్వుతూనే 'మా వరకూ రానిస్తారా?' అనేసి వెళ్ళిపోయారు. ఈ సీన్ చూసిన అభిమానులకి వెంటనే ఓ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది.

ఆమధ్య 'వరుడు' సినిమా ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ సేమ్ ఇలాగే చరణ్ లా చెప్పగా, అప్పుడు అల్లు అరవింద్ కూడా సేమ్ ఇలాగే చిరంజీవిలా చెప్పాడు. తర్వాత అర్జున్ స్నేహా రెడ్డి ప్రేమలోపడడం అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చరణ్, చిరంజీవిల సంభాషణను విన్న వాళ్ళంతా 'సేమ్ సీన్ రిపీట్ అవుతోందేమో!' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడని టాలీవుడ్ లో వార్తలొచ్చాయి కూడా. మొత్తానికి చరణ్ పెళ్ళి ఎలా జరుగుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X