Ram Charan Vs Jr NTR: గేమ్ ఛేంజర్‌ కోసం రాంచరణ్ రెమ్యురేషన్ ఎంత? ఎన్టీఆర్‌కు మించి.. ఎన్ని కోట్ల పారితోషికమంటే

సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్ చిత్రంపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో శంకర్ గట్టిగా హిట్ కొడుతాడా? RRR స్థాయిలో రాంచరణ్ సక్సెస్ సాధిస్తాడా? అనే ప్రశ్నలు సగటు సినిమా ప్రేక్షకుడు, మెగా అభిమానులను వెంటాడుతున్నాయి. ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో గేమ్ ఛేంజర్ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రాంచరణ్ తీసుకొన్న రెమ్యునరేషన్ విషయంపై భారీగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. జూనియర్ ఎన్టీఆర్ పారితోషికాన్ని కాంపారిజన్ చేస్తూ కథనాలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

గేమ్ ఛేంజర్ సినిమా కోసం దిల్ రాజు అత్యధికంగా ఖర్చు చేశారు. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో ఏ బ్యానర్ ఖర్చు పెట్టని విధంగా ఈ సినిమాలోని 5 పాటల కోసం 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. భారీ తారాగాణం, టాప్ టెక్నిషియన్స్ పనిచేయడంతో ఈ సినిమా బడ్జెట్ 450 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల మధ్య బడ్జెట్ అయింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో రాంచరణ్ తన రెమ్యునరేషన్‌ను కూడా తగ్గించుకొన్నాడనే విషయం బయటకు లీక్ అయింది.

Is Ram Charan beats Jr NTR s Devara Remuneration for Game Changer

RRR సినిమా కోసం సుమారుగా 75 నుంచి 80 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకొన్నాడు. ఈ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో బడ్జెట్, ఎక్కువ సమయం తీసుకోవడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తన రెమ్యునరేషన్‌కు భారీగా తగ్గించుకొన్నారు. ఈ సినిమా కోసం చెర్రీ సుమారుగా 65 కోట్ల రూపాయలు అందుకొన్నారు. అయితే ఈ పారితోషికం కొందరు బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు గుర్తు చేస్తున్నారు.

అయితే రాంచరణ్ రెమ్యునరేషన్‌ను ఎన్టీఆర్ తన తాజా చిత్రం దేవర కోసం తీసుకొన్న రెమ్యునరేషన్‌తో పోల్చుతూ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దేవర కోసం యంగ్ టైగర్ సుమారుగా 60 కోట్లు తీసుకొన్నాడు. చెర్రీ తన రెమ్యునరేషన్ తగ్గించుకొన్నప్పటికీ.. ఎన్టీఆర్‌కు మించి తీసుకొన్నారని కథనంలో పేర్కొన్నారు. దాంతో మెగా పవర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Is Ram Charan beats Jr NTR s Devara Remuneration for Game Changer

ఇదిలా ఉండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు రూపొందించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం అంజలి, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో అందరిలోనే ఆసక్తిని పెంచేలా చేస్తున్నది.

More from Filmibeat

Read more about: ram charan game changer jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X