మహేష్ ని ఫాలోఅయితే చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికాక తప్పదు..!
'అతిథి" తర్వాత మహేష్ సినిమా విడుదలవ్వటానికి దాదాపు మూడేళ్ళు పట్టింది. అతిథి ప్లాప్ అవ్వడంతో ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనలో పడ్డాడు మహేష్..అందుకే మూడేళ్ళ వరకు టైమ్ తీసుకున్నాడు. ఇక మూడేళ్ళ తర్వాత వచ్చిన 'ఖలేజా" చిత్రం కూడా ప్లాప్ గా నమోదైంది. ఇక ఇప్పుడు అదే పరిస్థితిలో వున్నాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.
'ఆరెంజ్" చిత్రం చరణ్ ను డైలామాలో నెట్టేసింది. ఎలాంటి కథతో సినిమా చేయాలనే ఆలోచనలో కన్ ఫ్యూజల్ లో ఇప్పటి వరకు చరణ్ నటిస్తున్న నూతన చిత్రమేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా, వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా వుంటుందనే వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా చరణ్ వాటిని ఇప్పటి వరకు 'ట్విట్టర్ లో చెప్పి కూడా చాలా కాలం అయింది)ప్రకటించలేదు. సో..చరణ్ కూడా మహేష్ బాటలో పయనిస్తే అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదు..చరణ్ ఇప్పుడైనా మేల్కొని తన తదుపరి చిత్రాన్ని డిసైడ్ చేసుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











