RC 16: రాజమౌళిని ఫాలో అవుతున్న రాంచరణ్.. RC16 సెట్లో కఠినంగా!

సినిమా పరిశ్రమలో అభద్రతా భావం ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా అవుతున్నది. ఏకంగా రిలీజైన వెంటనే సినిమా మొత్తం హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నది. ఇక షూటింగు జరిగే సమయంలో సెట్లో నుంచి కీలకమైన సన్నివేశాలు, గెటప్స్, లుక్స్ అన్నీ లీకుల మయం అవుతున్నాయి. ఇలాంటి దుశ్చర్యల కారణంగా సినిమాలో ఉండే గోప్యత చాలా కరువైపోతుందనే వాదన ఇండస్ట్రీలోను, నిర్మాత, దర్శకుల నుంచి వినిపిస్తున్నది. అయితే ఇలాంటి లీక్స్ బెడద నుంచి తప్పించుకోవడానికి గ్లోబల్ స్టార్ రాంచరణ్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. ఆ విషయాల్లోకి వెళితే..

గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మెగా పవర్ స్టార్‌కు చేదు అనుభవం ఎదురైంది. సినిమాకు సంబంధించిన పాటలు ముందే లీక్ అయ్యాయి. అలాగే ఇంపార్టెంట్ సీన్లు, అలాగే సినిమా మొత్తం రిలీజైన వెంటనే వందల కొద్ది లింకులు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. పైరసీకి పాల్పడిన కొందరు నెటిజన్లు సినిమాను తీవ్రంగా డ్యామేజ్ చేశారు. దాంతో తన తదుపరి సినిమా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది.

Is Ram Charan following SS Rajamouli Here is RC 16 Exclusive Update

గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం పేరు ఇంకా పెట్టలేదు. RC16 గా వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైంది. ఈ సెట్‌లో రాంచరణ్ టీమ్ కఠినమైన నిబంధనలు పాటిస్తున్నట్టు తెలిసింది.

ఇక RC16 సినిమా విషయానికి వస్తే.. పిరియాడిక్ టచ్‌తోపాటు గెటప్, లుక్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉన్న సినిమా అనే మాట వినిపిస్తున్నది. ఈ సినిమా కథకు, గెటప్‌కు చాలా రిలేషన్ ఉంటుంది. కాబట్టి సెట్‌లో రాంచరణ్ తన చిత్ర యూనిట్‌కు సీరియస్‌గా కొన్ని ఆంక్షలు విధించారట. ఈ చిత్ర యూనిట్ సభ్యులెవ్వరూ కూడా సెట్‌లోకి సెల్ ఫోన్ తీసుకు రాకుండా కండిషన్స్ పెట్టారట. దాంతో పైరసీ, లీకులకు అడ్డు కట్టవేసే ప్రయత్నం చేస్తున్నారట.

Is Ram Charan following SS Rajamouli Here is RC 16 Exclusive Update

సాధారణంగా ఇలాంటి ఆంక్షలను తన షూటింగులో దర్శక ధీరుడు రాజమౌళి పెడుతుంటారట. గతంలో RRR, మగధీర సినిమా షూటింగులో జక్కన అనుసరించిన నియమాలను ప్రస్తుతం చెర్రీ అమలు చేస్తున్నారట. ఈ విషయంలో రాజమౌళిని మెగా పవర్ స్టార్ ఫాలో అవుతున్నారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసే నిర్మాతకు ఇది మేలు చేకూర్చే విషయమని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ram charan ss rajamouli rc16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X