జంజీర్‌లో రామ్ చరణ్ సరసన సన్నీ లియోన్?

By Srikanya

రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం జంజీర్ లో రెండు ఐటం సాంగ్ లు పెడుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తొలిసారిగా బాలీవుడ్ కి పరిచయమవూతూండటంతో ఈ చిత్రంలో కావాల్సినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలపాలని దర్శకుడు అపూర్వ లఖియా ఫిక్స్ అయ్యాడట. ఈ విషయాలపై రోజుకో మసాలా వంటకం రెడీ చేస్తోంది బాలీవుడ్ మీడియా. తాజాగా సన్నిలియోన్ ని అడ్డం పెట్టుకుని రామ్ చరణ్ ...బాలీవుడ్ ని దాటాలనుకుంటున్నారని ప్రచారం చేస్తోంది. సన్నిలియోన్ ఐటం సాంగ్ ఈ చిత్రంలో పెట్టడం ద్వారా ఈ సినిమాకు క్రేజ్ తేవచ్చని,ఉత్తరాదిలో రామ్ చరణ్ ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి స్ట్రాటజీలు తప్పవని అంటోంది.

అయితే ఇప్పటివరకూ అపూర్వ లఖియా ఈ విషయమై నోరు మెదపలేదు. సన్ని లియోన్ సైతం తాను జంజిర్ కమిటైనట్లు చెప్పుకోలేదు. రామ్ గోపాల్ వర్మ అంతటి వాడు ఐటం సాంగ్ కి ట్రై చేసినా దొరకని భామ అపూర్వ లఖియాకు దొరుకుతుందా అని కొందరు లాజిక్కులు అడుగుతున్నారు. అయితే జిస్మ్ సినిమా రిలీజయ్యాక ఆమెకు క్రేజ్ పెరుగుతుందని,అప్పుడే కదా జంజీర్ విడుదల అయ్యేది కాబట్టి ఆమె ఐటం సాంగ్ పెట్టే అవకాసం ఉందని అంటున్నారు. అప్పటికీ మహేష్ భట్ తో ఆమె ఎగ్రిమెంట్ కూడా అయ్యిపోతుందని చెప్తున్నారు.

ఇక సన్ని లియోన్ విషయానికి వస్తే ఆమె మహేష్ భట్ నిర్మిస్తున్న జిస్మ్ 2 లో హీరోయిన్ గా ఎంపికైంది. పూజా భట్ నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న ఆ చిత్రం ఓ క్రైమ్ ధ్రిల్లర్ అని చెప్తున్నారు. ఈ చిత్రంలో సన్నిలియోన్ ని తీసుకోవటంతో ప్రాజెక్టు హాట్ గా మారింది. ట్రేడ్ లో ఓ రేంజి బిజినెస్ జరగనున్నట్లు సమాచారం. సన్ని లియోన్ ని ఆ సినిమా పూర్తయ్యే దాకా వేరే సినిమాలోకి తీసుకోకూడదని ఎగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆమె వర్మ సినిమాలోకి రాలేదు. మరే హిందీ చిత్రమూ కమిట్ కాలేక పోయింది.

ఇక సన్ని లియోన్ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ...తన పేరెంట్స్ పంజాబ్ కి చెందిన వారే నని తాను ఇండియాకు చెందిన దాన్ని అనే అంది. తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని,కానీ డబ్బు సంపాదించటానకి అదో మంచి మార్గం అని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది. మొదట తన తల్లితండ్రులు వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను జిస్మ్ 2 లో నటిస్తున్నానని, ఆ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. అలాగే బిపాసా బసు నటించిన జిస్మ్ చిత్రం చూసానని,ఆ పాత్రను ఆకళింపు చేసుకుని మరీ ఈ సీక్వెల్ లో చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక జిస్మ్ 2 చిత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని,ఏ మాత్రం తేడా వచ్చినా ఆమె ఫోర్న్ స్టార్ కావటంతో సెన్సార్ వద్ద పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫెరఫెక్ట్ గా వారిని ఎదుర్కోవటానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X