Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాంచరణ్ మరో మెగా ప్రాజెక్ట్.. పవన్‌తో మూవీకి అబ్బాయ్ ప్లాన్
టాలీవుడ్‌ను వదిలేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్ మళ్లీ తెలుగు తెరపైకి వస్తున్నారనే వార్త మీడియాలో బలంగా వినిపిస్తున్నది. అయితే పవర్ స్టార్ మాత్రం ఎలాంటి సిగ్నల్ ఇవ్వకపోవడంతో అభిమానులు గందరగోళంలో పడుతున్నారు. అయితే మీడియాలో మాత్రం పవన్ రీ ఎంట్రీ గురించి కథనాలను మాత్రం పుష్కలంగా వెలువరిస్తున్నది. ఈ క్రమంలో పవన్ రీఎంట్రీపై హాట్ వార్త వైరల్ అయింది..
తండ్రి సినిమాకు నిర్మాతగా
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే తండ్రి చిరంజీవికి ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీని ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా సైరాను నిర్మించి చిరంజీవి కెరీర్లోనే అత్యద్భుతమైన సినిమాను అందించాడనే విదితమే.
సైరా ప్రమోషన్స్‌లో
ఇక సైరా ప్రమోషన్స్‌లో నిర్మాతగా రాంచరణ్‌కు 10కి 10 మార్కులు వేసి ఉత్తమ ప్రొడ్యూసర్‌గా మార్చేశాడు. అంతేకాకుండా పవన్ సినిమాకు కూడా చెర్రీ నిర్మాతగా మారితే అంతకంటే సంతోషం ఏముంటుందనే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వార్త మీడియాలో హల్చల్ చేస్తున్నది.
పవన్ సినిమాకు నిర్మాతగా
మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త ఏమిటంటే.. సైరా అందించిన ఉత్సాహంతో మరోసారి రాంచరణ్ ఓ క్రేజీ సినిమాకు నిర్మాతగా మారబోతున్నారట. త్వరలో పవన్ కల్యాణ్ నటించే సినిమాకు నిర్మాతగా మారబోతున్నాడనే విషయం సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతున్నది. పవన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం.
RRR చిత్రంగా
కాగా, ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో RRR అనే చిత్రంలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 30, 2020లో రిలీజ్ కానున్నది. ఓ వైపు ఈ చిత్రంలో నటిస్తూనే బాబాయ్ సినిమా నిర్మాణంపై లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తున్నది. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే ఓ ప్రకటన అధికారికంగా వెల్లడయ్యే అవకాశం లేకపోలేదు.