RC16 మూవీకి భారీ ఓటీటీ డీల్స్.. రికార్డు ఆఫర్స్‌కు రాంచరణ్ రిజెక్ట్? కారణం ఏమిటంటే?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర రానున్న పలు మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితా తీస్తే అందులో దాదాపు మన తెలుగు సినిమా నుంచి రానున్న పాన్ ఇండియా చిత్రాలే డెఫినెట్ గా ఉంటాయని చెప్పవచ్చు. కాగా ఈ సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతీ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది.

సెన్సేషనల్ సినిమా ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా సహా వరల్డ్ వైడ్ గా కూడా మంచి ఆదరణ చరణ్ అందుకున్నాడు. కాగా ఇపుడు ఉన్న పరిస్థితుల్లో ఓ హీరోకి తన స్టార్డంని కాపాడుకోవడం అలాగే దానిని అలానే మైంటైన్ చేస్తూ మరింత రీచ్ అవ్వడం అనేది మెయిన్ అంశంగా ఉంటుంది. కాగా ఇలా రామ్ చరణ్ పై కూడా చాలా ప్రెజర్ ఉంది.

Is Ram Charan Rejects Huge OTT offers for Buchchi Babu Sana s RC16

అయితే ఈ అంశంలో కేవలం థియేటర్స్ లో సినిమా విడుదల చేయడం అనేది మాత్రమే కాకుండా ఓటిటిలు పరంగా కూడా ఆయా హీరోల రీచ్ అనేది ఆధార పడి ఉంటుంది అనేది ముమ్మాటికీ వాస్తవం. కాగా ఇలానే తన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది కానీ ఇది వచ్చినట్టుగా తెలుగు ఆడియెన్స్ కి తప్ప మిగతా దేశంలో ఎవరికీ తెలీదు.

ఇక హింది వెర్షన్ అయితే మరీ దారుణం. హిందీ వెర్షన్ ని జీ5 వారు సొంతం చేసుకున్నారు కానీ వారి ఓటిటిలో మొన్ననే వచ్చినట్టుగా కూడా ఎవరికీ తెలీదు. దీనితో ఈ అంశాన్ని మాత్రం రామ్ చరణ్ సీరియస్ గా తీసుకున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆల్రెడీ తన ప్రస్తుత సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో చేస్తున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Is Ram Charan Rejects Huge OTT offers for Buchchi Babu Sana s RC16

దీనితో పలు ఓటిటిలు నెవర్ బిఫోర్ ధరలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. మెయిన్ గా మళ్ళీ అమెజాన్ ప్రైమ్ ముందు వరుసలో ఉంటే వారికి మించిన రికార్డు నంబర్ ని మరో ఓటిటి సంస్థ సోనీ లివ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ వీటిలో దేనికి కూడా హీరో సుముఖంగా లేడని తెలుస్తుంది. ఈ సినిమా హక్కులు కేవలం వరల్డ్ పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ మాత్రమే ఇవ్వాలని చరణ్ సూచించినట్టుగా తెలుస్తుంది.

నెట్ ఫ్లిక్స్ అయితేనే తనకి ఇంటర్నేషనల్ రీచ్ ఉంటుంది అని వారికి మాత్రమే సినిమా ఇవ్వాలని చెప్పేసినట్టుగా తెలుస్తుంది. కాగా రామ్ చరణ్ లాజిక్ లో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే RRR సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి నెట్ ఫ్లిక్స్ ప్రధాన కారణం. నెట్ ఫ్లిక్స్ కంటే ముందే జీ5 లో RRR వచ్చింది కానీ.. అందులో రాని రీచ్ ఎప్పుడైతే నెట్ ఫ్లిక్స్ లో సినిమా హిందీ వెర్షన్ లో వచ్చిందో అప్పుడు నుంచే RRR కి ఈ రేంజ్ ఫేమ్ అయినా రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ అయినా రావడం జరిగింది. ఇందులో అంత భారీ ఆఫర్లు వచ్చినా కూడా రామ్ చరణ్ మాత్రం నెట్ ఫ్లిక్స్ కి మాత్రమే ఓటిటి డీల్ ఇవ్వాలని నిర్మాతలకి చెప్పేసినట్టు టాక్. కాగా ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది మరింత సమాచారం రావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: ram charan rc16 janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X