RC15 రాంచరణ్ కోసం నాలుగు క్రేజీ టైటిల్స్.. శంకర్ సినిమాకు పవర్‌పుల్ పేరు ఏమిటంటే?
మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్నది. రాంచరణ్ పలు కార్యక్రమాలతో బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ అనుకొన్న సమయం కంటే ఎక్కువగానే తీసుకొంటున్నది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించిన వార్త మీడియాలో ఆసక్తికరంగా చక్కర్లు కొడుతున్నది. రాంచరణ్ సినిమా కెరీర్‌లో 15వ చిత్రంగా రూపొందుతున్న RC15 సినిమా టైటిల్ ఏమిటంటే?

రాజకీయ, సామాజిక ఇతివృత్తంతో
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 చిత్రం రాజకీయ, సామాజిక ఇతివృత్తాలతో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో రాంచరణ్ సీఎంగా కూడా కనిపిస్తారనేది మీడియాలో ఓ టాక్. సామాజిక సమస్యల నేపథ్యంతో శంకర్ టచ్ ఉండేలా RC15 ను అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా తెరకెక్కిస్తున్నారు.

నాలుగు పవర్‌పుల్ టైటిల్స్ రిజిస్టర్
అయితే RC15 సినిమా కోసం పవర్‌పుల్ టైటిల్స్‌ను రిజిస్టర్ చేశారు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. ఈ సినిమా కోసం సేనాని, సేనాపతి, సీఈవో, సైనికుడు అనే నాలుగు టైటిల్స్‌ను రిజిస్టర్ చేశారు. వీటిలో ఒకటి ఫైనల్ చేస్తారనే విషయం చర్చనీయాంశమైంది.

రాంచరణ్ టీమ్‌కు నచ్చిన టైటిల్
RC15 సినిమా కోసం రిజిస్టర్ చేసిన నాలుగు టైటిల్స్‌లో సేనాని అనే టైటిల్‌ను రాంచరణ్ టీమ్ ఫైనల్ చేసింది. అయితే శంకర్‌కు సేనాని టైటిల్ నచ్చలేదు. సైనికుడు అనే టైటిల్‌ను దర్శకుడు శంకర్ ఇష్టపడ్డాడు. అయితే ఈ రెండు టైటిల్స్‌తో సీఈవో టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

మార్చి 27న గ్రాండ్‌గా టైటిల్ రివీల్
అయితే మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదినం సందర్భంగా అంటే.. మార్చి 27వ తేదీన RC15 టైటిల్‌ను ప్రకటించేందుకు ప్లాన్ చేశారు. రాంచరణ్ బర్త్ డే రోజున టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటు మోషన్ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు అని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

RC15 లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: రాంచరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య, జయరాం, శ్రీకాంత్, నవీన్ చంద్ర, నాజర్, రఘుబాబు, సముద్రఖని తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్ శంకర్
కథ: కార్తీక్ సుబ్బరాజ్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
సినిమాటోగ్రఫి: తిరు, ఆర్ రత్నవేలు
ఎడిటింగ్: రత్నవేలు
మ్యూజిక్: థమన్ ఎస్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్


Click it and Unblock the Notifications











