Ram Charan ఉపాసన, క్లింకారతో రామ్ చరణ్ అక్కడికి షిఫ్ట్.. అసలు ఏం జరిగిందంటే?
ఏంటి టైటిల్ చూసి షాకయ్యారా? గత వారం రోజులుగా ప్రతిరోజూ ఇదే విషయంపై జోరుగా ప్రతీ రోజు వార్తలు వస్తున్నన సంగతి తెలిసిందే. అసలేం అంతలా చిరుతో జరిగింది? భార్య, కూతరితో కలిసి రామ్ చరణ్ ఎక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు? అసలు ఇందులో నిజం ఉందా లేదా? వంటి విషయలాను స్టోరిలోకి వెళ్లి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం..
వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. మొదట్లో తనకు దొరికిన కథలు, దర్శకుల వల్ల మంచి హీరోగా పేరొందిన ఆయన ఆ తర్వాత మాత్రం ధృవ, రంగస్థలం చిత్రాలతో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ అయిపోయారు. విశేష అభిమానాన్ని సంపాదించుకున్నార.

అయితే చరణ్ ఎంత ఎదిగిన కూడా తన తండ్రి చిరంజీవి మాటను జవదాటరు అని చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా చిరు అంటే తనకు ఎంత గౌరవమో, ప్రేమో, అభిమానమో పలు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడాయనకు తండ్రి చిరుతో మనస్పర్థలు వచ్చి ఇంటి నుంచి షిఫ్ట్ అయిపోతున్నారనే వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ నిజమేనా ఇది అనుకుంటూ కాస్త టెన్షన్ పడుతున్నారు.
కానీ అసలు విషయమేమిటంటే ఇందులో నిజం లేదని తెలిసింది. చరణ్ బాబు ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డనే.రీసెంట్గా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సతీసమేతంగా హాజరైన చరణ్ ఇప్పుడు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే ఇప్పుడు తన సినిమాలపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ షూటింగ్‌లో చరణ్ తిరిగి జాయిన్ అవ్వబోతున్నారని తెలిసింది. వైజాగ్‌లో మార్చి 15 నుంచి షూట్ ప్రారంభం కానుంది. మూవీని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉండాలని అనుకున్నారట. కానీ అదే సయయంలో తన భార్య, బిడ్డలతో కూడా సమయాన్ని గడపాలని అనుకుంటున్నారట. అందుకే ఉపాసన, క్లీంకారను తీసుకుని వైజాగ్‌కు వెళ్తున్నారని తెలిసింది. అసలు విషయం ఇది అయితే.. గాసిప్స్ రాయుళ్లు మాత్రం చిరుతో మనస్పర్థలు అందుకే చరణ్ షిఫ్ట్ అయిపోతున్నారంటూ కూతలు కూస్తున్నారు. సో ఫ్రెండ్స్ అసలు విషయం ఇది అని తెలిసింది.
కాగా, రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ ఛేంజర్ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. సినిమాలో నవీన్ చంద్ర, అంజలి, ఎస్ జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్ సహా పలువురు కీలక పాత్ర పోషిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజ్ తన 50వ చిత్రం కావడం వల్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











