‘సాహో’లో రామ్ చరణ్ కూడా పెట్టుబడి పెట్టారా? వాటా ఎంత?

Recommended Video

Ram Charan's Secret Investment In Saah Movie! || Filmibeat Telugu

భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ మూవీ 'సాహో' మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాణంలో యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటితో పాటు టి-సిరీస్ భూషణ్ కుమార్ కూడా భాగస్వామిగా ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఓ ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది. 'సాహో'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పెట్టుబడి పెట్టారట.

‘సాహో'లో రామ్ చరణ్ షేర్ ఎంత?

‘సాహో'లో రామ్ చరణ్ షేర్ ఎంత?

‘సాహో' చిత్రంలో రామ్ చరణ్ 10 శాతం స్టేక్ హోల్డర్‌గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం ఫిల్మ్ నగర్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఇటు సాహో నిర్మాతల నుంచి కానీ, అటు రామ్ చరణ్ నుంచి కానీ ఈ విషయమై ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు.

నిర్మాతగా భారీ చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తున్న రామ్ చరణ్

నిర్మాతగా భారీ చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తున్న రామ్ చరణ్

కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సొంత బేనర్ స్థాపించిన రామ్ చరణ్.... ఈ బేనర్లో తొలి చిత్రంగా ‘ఖైదీ నెం.150' తెరకెక్కించారు. ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి' రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 200 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు.

యువి క్రియేషన్స్ వారితో రామ్ చరణ్ అనుబంధం

యువి క్రియేషన్స్ వారితో రామ్ చరణ్ అనుబంధం

యువి క్రియేషన్స్ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటితో రామ్ చరణ్‌కు మంచి స్నేహం ఉంది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రాన్ని వారు నైజాంలో విడుదల చేయడంతో పాటు వినయ విదేయ రామ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రైట్స్ కొని రిలీజ్ చేశారు.

‘సాహో' రామ్ చరణ్ న్యూస్ లీకైన వెంటనే వైరల్

‘సాహో' రామ్ చరణ్ న్యూస్ లీకైన వెంటనే వైరల్

‘సాహో'లో రామ్ చరణ్ 10 శాతం పెట్టుబడి పెట్టినట్లు వార్తలు ప్రచారంలోకి రాగానే ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో... అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెట్టుబడి పెట్టారనేది చర్చనీయాంశం అయింది.

మెగా అభిమానుల నుంచి సపోర్ట్

మెగా అభిమానుల నుంచి సపోర్ట్

‘సాహో'లో రామ్ చరణ్ పెట్టుబడి పెట్టిన విషయం తెలియగానే మెగా అభిమానుల్లో సైతం ఆసక్తి పెరిగింది. ఈ చిత్రానికి వారి మద్దతు కూడా ఉంటుందని అంటున్నారు. రామ్ చరణ్ పెట్టుబడి పెట్టారు అనడంలో నిజం ఎంతో తెలియదు కానీ సాహోకు ఇది మరింత ప్లస్సయ్యే అంశమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X