Peddi: పెద్ది రిలీజ్‌పై అనుమానాలు?.. మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసేనా?
మెగా పవర్ స్టార్ రాంచరణ్, గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఉప్పెన తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, విజి చంద్రశేఖర్, రజతవ దత్తా, సత్య తదితరులు నటిస్తున్నారు.
క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో పిరియాడిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు, ఎఢిటింగ్: నవీన్ నూలీ, మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదట మార్చి 19వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం, షూటింగ్ వర్క్ ఇంకా ఫినిష్ కాకపోవడంతో ఈ సినిమాను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడనున్నట్టు వార్తలు మీడియాలో వెలువడుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వెలువడుతున్న పెద్ది సినిమా మ్యూజిక్ రిలీజ్‌కు ముందే హిట్ అయింది. ఈ సినిమా పాటలు దేశవ్యాపత్ంగా సంచలనం రేపుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ సినిమా పాటకు రీల్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన ప్రకారం రాకపోవచ్చనే వార్తలు మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఇంకా షూటింగ్ పార్ట్ పూర్తి కావాల్సి ఉంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ పనులు పూర్తయ్యే దశలోనే ఉన్నాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆ పనులు పూర్తి అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్‌ను మరోసారి వాయిదా వేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ పనులు పూర్తయితే ఏప్రిల్ 30 తేదీకి రావడం ఖాయంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.
పెద్ది సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే రూమర్లు వస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించడంతో వాటికి మరికాస్త బలం చేకూరేలా కనిపిస్తున్నాయి. పెద్ది కారణంగా వెనక్కి తగ్గిన కొన్ని సినిమాలు తమ డేట్స్‌ను మార్చుకొని ముందే రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకొంటున్నాయనే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయితే పెద్ది సినిమా రిలీజ్ డేట్‌పై వస్తున్న రూమర్లకు అడ్డుకట్ట పడాలంటే.. నిర్మాత, దర్శకులు ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తే.. కొంత గందరగోళం తగ్గే అవకాశం ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications
















