పూరీ జగన్నాధ్ ఐడియానే రామ్ గోపాల్ వర్మ కాపీ కొడ్తున్నారా?
దర్శకుడు పూరీ జగన్నాధ్ ని ఆయన గురువు రామ్ గోపాల్ వర్మ అనుకరిస్తారా అని ఫిల్మ్ నగర్ లో డౌట్ లు వ్యక్తీకరిస్తున్నారు. దానికి కారణం నేనింతే చిత్రంలో వెబ్ మీడియాపై కసి కద్దీ సెటేర్స్ వేసి చివరకు సినిమాలో విషయం లేక చతికిలపడ్డారు పూరీ. మళ్ళీ అదే రూటులో రామ్ గోపాల్ వర్మ వెబ్ మీడియాని టార్గెట్ చేయబోతున్నారని సమాచారం. ఆయన తాజా చిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజులో ఆయన ఈవీ అనే పాత్రను పెట్టి హాఫ్ బ్రెయిన్ డాట్ కామ్ అని సెటైర్స్ వేయబోతున్నారని తెలుస్తోంది. ఈవీ అంటే జీవీ అని, హాఫ్ బ్రెయిన్ డాట్ కామ్ అంటే ఐడియల్ బ్రెయిన్ డాట్ కామ్ అని అర్ధంట. ఇక ఈ పాత్రని రాజా రవీద్ర పోషించబోతున్నారు. నాలుగు రోజుల కాల్ షీట్స్ ఇందుకోసం రవీంద్ర ఇచ్చారని తెలుస్తోంది.
ఇక రివ్యూలు చూసి భాధపడే వర్మ ఇలా డైరక్ట్ విమర్శలకు దిగుతున్నాడంటున్నారు. అయితే మరి వెబ్ మీడియా గురించి తెలియని సామాన్య ప్రేక్షకుడులు వీటిని ఎలా అర్ధం చేసుకుని రిసీవ్ చేసుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తమ వ్యక్తిగత కక్షలకు సినిమాను తీయటం ఎంతవరకూ సబబు అనేది అందరి ఆలోచన. ఇక ముహూర్తం రోజునే వర్మ...తెలుగులో ఇతర డైరక్టర్స్ ఉన్న తనకున్న అమూల్యమైన అభిప్రాయాలను పాటలుగా రాయించి వదిలాడు. అది వినేవారికి ఎంజాయ్ మెంట్ గా ఉన్నా ఆ దర్శకులకు మాత్రం సూటిగా తగిలే బాణమే. ఏదైమైనా డైరక్టర్ అవ్వాలనే హీరో ఆశయం గల నేనింతే చిత్రం కామిడీ వెర్షన్ గా అప్పలరాజు మిగిలిపోకూడదని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











