వర్మ ఛీ కొట్టాడు కాబట్టే మహేష్ బాబు ‘ది బిజినెస్ మాన్’ అవుతున్నాడా...
పూరి జగన్నాథ్, మహేష్ బాబుల కలయికలో సినిమా అంటే సంచలనమే ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన 'పోకిరి" లాంటి హిట్టు తర్వాత వీరిద్దరూ మళ్లీ కలవటానికి సమయం పట్టినా ఇప్పడు 'ది బిజినెస్ మ్యాన్" టైటిల్ మీద ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారికీ చిత్రం కన్ఫర్మ్ అయినట్టు వస్తున్న వార్తలు అఫిషియల్ అని తెలిసిపోయింది. సరిగ్గా ఆరునెలల క్రితం ఇదే కథతో రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో పూరి బాలీవుడ్ లో ఆరంగ్రేటం చేయాలనుకున్న దానిని ఇప్పుడు మహేష్ బాబుకి అప్పగించడం చూస్తుంటే వర్మ ఛీ కొట్టాడా లేక పూరీకే వర్మంటే నమ్మకం పోయిందా అన్న డౌట్ రైజ్ అవుతోంది.
వర్మ తెలుగు పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత బాగా క్లోజ్ గా మూవ్ అయిన సర్కిల్ లో పూరీ మొదటి వాడు. 'నేను నా రాక్షసి" చిత్రానికి ప్రీ పబ్లిసిటీ కూడా దంచేసిన వర్మను కాదని ఈ మాఫియా నేపధ్యంలో సాగే 'బిజినెస్ మ్యాన్" తుపాకిని పూరి వర్మ మీదే ఎక్కువ పెడుతున్నాడు అంటే 'సంథింగ్ పౌల్" అంటూ కొందరు గుసగుసలాడుతున్నారు.


Click it and Unblock the Notifications











