twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Yatra2 ఏపీ సీఎంతో రాంగోపాల్ వర్మ భేటి.. ఎన్నికలకు ముందు యాత్ర సీక్వెల్‌!

    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటి కావడం మీడియాలోను, సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకుదారి తీసింది. సీఎం జగన్‌తో ఆర్జీవి భేటీ దాదాపు 40 నిమిషాలపాటు జరగడం గమనార్హం. విజయవాడకు సమీపంలోని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో వీరిద్దరి భేటి జరిగింది. భేటీ అనంతరం సీఎం జగన్, వర్మ లంచ్ చేసినట్టు మీడియా వర్గాలు ధృవీకరించాయి. అయితే వారిద్దరి భేటి గురించి వివరాలను గోప్యంగా ఉంచారు. వారి మధ్య ఏం చర్చ జరిగిందనే విషయం ఆసక్తికరంగా మారాయి.

    గతంలో ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో, అలాగే టికెట్ల రేట్ల వివాద క్రమంలో ఏపీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయ్యారు. అయితే అప్పట్లో ఆర్జీవి భేటికి పెద్దగా ప్రాధాన్యం అంతగా ఏర్పడలేదు.

    ఇక పవన్ కల్యాణ్‌కు సంబంధించి వైజాగ్ సంఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ వర్గాలతో చర్చలు జరుపుతున్నది. ఇప్పటికే ఆలీ, పలువురు సినీ ప్రముఖులతో సీఎం జగన్ సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

    Is Ram Gopal Varma meeting with YS Jagan Mohan Reddy for Yatra 2?

    అయితే వర్మ, జగన్ భేటీ తర్వాత సోషల్ మీడియాలో ఆసక్తికరంగ పోస్టులు కనిపించాయి. యాత్ర 2 సినిమా గురించి వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. యాత్ర 2 సినిమాలో వైఎస్ జగన్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్‌గా రూపొందనున్నదని.. అంతేకాకుండా ఈ సినిమా కోసం కేవలం 25 రూపాయల టికెట్ ధరను పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు అనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    గతంలో ఏపీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని చాలా రోజులుగా ఊహాగానాలు రావడం, ఇదే క్రమంలో వర్మ, ఏపీ సీఎంతో కలవడం చర్చనీయాంశమైంది.

    English summary
    Popular Director Ram Gopal Varma meeting with YS Jagan Mohan Reddy goes crazy in Telugu Media. Reports suggest that, These two stalwarlts met for Yatra 2 movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X