రమ్యకృష్ణది స్వయంకృతాపరాధమేనా.. క్రేజీ చిత్రంలో ఛాన్స్ మిస్
శివగామి పాత్రతో నేషనల్ వైడ్‌గా ఫుల్ ఫేమస్ అయింది రమ్యకృష్ణ. ప్రభాస్, అనుష్క, కట్టప్ప, రానా, రమ్యకృష్ణలకు ఓ రేంజ్ క్రేజ్ వచ్చింది. ఈ ఒక్క చిత్రంతో వారు జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యారు. సత్యరాజ్ అప్పటి వరకు దాదాపు 250 సినిమాలు చేసి ఉన్నా రాని క్రేజ్.. బాహుబలితో వచ్చింది. రమ్యకృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు అద్భుతమైన అవకాశం వచ్చింది. రాజమాతగా శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఓ రేంజ్‌లో జీవించింది. అయితే మళ్లీ అంతటి పేరును తెచ్చిపెట్టే చిత్రం ఆమె ఖాతాలో పడలేదు.

కలిసిరాని చిత్రాలు..
బాహుబలి వంటి సినిమాలో నటించి మెప్పించిన రమ్యకృష్ణకు మళ్లీ అలాంటి పాత్ర దక్కలేదు. మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని అంతా భావించినా అది జరగలేదు. శైలజా రెడ్డి అల్లుడు లాంటి అడపాదడపా చిత్రాలు చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా రమ్యకృష్ణ వదులుకున్న ఓ క్రేజీ చిత్రం గురించి బయటకు వచ్చింది

క్రేజీగా మారిన చాప్టర్2..
కేజీఎఫ్ సినిమా గురించి, హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. కేజీఎఫ్ సినిమా సృష్టించిన సంచలనాలు ఇంకా కళ్ల ముందే మెదులుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.250కోట్లు కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కేజీఎఫ్ చాప్టర్ 2లో చాన్స్ మిస్..
ఇక కేజీఎఫ్ అంతటి ప్రభంజన సృష్టించడంతో.. చాప్టర్2ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా భారీ క్యాస్టింగ్‌ను లైన్‌లో పెడుతున్నారు. అందులో భాగంగానే సినిమాలో ముఖ్యమైన అధీరా పాత్రకు సంజయ్ దత్‌ను తీసుకున్నారు.
Recommended Video

మిస్ చేసుకున్న రమ్యకృష్ణ..
తాజాగా మరో కీలకమైన పాత్రకు రవీనా టాండన్‌ను తీసుకున్నారు. అయితే ఈ ఆఫర్‌ను ముందు రమ్యకృష్ణ వద్దకు తీసుకెళ్తే.. భారీ రెమ్యూనరేష్ కావాలంటూ మొండికేసిందట. దీంతో రవీనాను ఈ క్రేజీ ఆఫర్ వరించినట్టు కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఏది ఏమైనా రమ్యకృష్ణను గనుక అప్రోచ్ అయి.. ఆమె తిరస్కరించి ఉంటే ఓ క్రేజీ ఆఫర్ కోల్పోయినట్టేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











