Jai Hanuman: రిషబ్ హనుమంతుడు అయితే .. మరీ రానా రోల్ ఏంటీ ? ప్రశాంత్ వర్మ ప్లాన్ అదేనా?
Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మధ్యకాలంలో తెగ వినిపిస్తుంది. హనుమాన్ మూవీ సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ గా మారడంతో సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు ప్రశాంత్ వర్మ. ఈ మూవీలో హనుమంతుడు పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న విషయం తెలిసింది. తాజాగా ఈ మూవీలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ హీరో రానా దగ్గుబాటి నటిస్తే.. ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
తేజా సజ్జా హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'హనుమాన్' (Hanuman). ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గత రికార్డులను బ్రేక్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎవ్వరి ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.350 కోట్లు వసూళ్లు రాబట్టింది. యంగ్ హీరో తేజ కెరీర్ లోనే కాదు. . ప్రశాంత్ వర్మ కెరీర్ లో అల్ టైం హిట్ గా నిలిచింది. ఇంతకీ భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ గా 'జై హనుమాన్'(Jai Hanuman) అనే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాపై ప్రకటనతోనే అంచనాలు అమాంతం పెరిగాయి. అంచనాలకు తగ్గట్టుగానే మూవీ మేకర్స్ కూడా ఫ్యాన్ చేస్తున్నారు.ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ క్రియేట్ అయ్యేలా ఎప్పటికప్పుడూ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇటీవల దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. హనుమంతుడు పాత్రలో కాంతార హీరో, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishabh Shetty)నటించబోతున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. హనుమంతుడు పాత్రలో రిషబ్ శెట్టిని సెలక్ట్ చేయడంపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొంత మంది మాత్రం దారుణంగా ట్రోలింగ్ చేశారు.
ఈ ట్రోల్స్ కు పుల్ స్టాప్ పడేలా.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 'హనుమాన్ పాత్రలో జాతీయ అవార్డు యాక్టర్ రుషబ్ శెట్టి నటిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అతని హనుమంతుని పట్ల ఉన్న భక్తి, సాటిలేని అంకితభావం నిజంగా ఆ పాత్రకు ప్రాణం పోస్తారని నమ్ముతున్నా.. తన అద్భుత నటనతో ఆ పాత్రకు మరింత పరిపూర్ణత తీసుకరాబోతున్నారు. అతని నటనతో జై హనుమాన్ మూవీ అసాధారణమైనదిగా మారుతుంది. కర్నాటక నుండి వర్డల్ వైడ్ గా అతనికి అభిమానులున్నారని, తెలుగులో జై హనుమాన్ తో ప్రయాణాన్ని ప్రారంభించినందుకు కృతజ్ఞతలు" అంటూ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. జై హనుమాన్ సినిమాలో హీరో రిషబ్ శెట్టితో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. అది ఎవరో కాదు.. రానా దగ్గుబాటి. జై హనుమాన్ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోను ప్రశాంత్ వర్మ షేర్ చేయడంతో పాటు యూనివర్స్ ఇన్‌స్టా హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేశారు. దీంతో జై హనుమాన్ లో రానా ఉండబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
రిషబ్ శెట్టి హనుమంతుడు పాత్రలో నటిస్తే.. రానా ఏ పాత్రలో కనిపించబోతున్నారు. టాలీవుడ్ కథనాల ప్రకారం.. రానా .. దశకంఠుడు రావణాసురుడిగా కనిపించబోతున్నడని తెలుస్తోంది. రావణాసురుడి పాత్రకు రానా పర్ఫెక్ట్ ఛాయస్ అని టాక్ వస్తుంది. రానా గంభీరమైన రూపం రావణుడికి పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఇది అఫీషియల్ ప్రకటన కాకపోయిన.. ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. అధికారికంగా ప్రకటించాల్సి రావాల్సింది. అన్ని సెట్ అయితే.. ఈ మూవీ 2026లో జై హనుమాన్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











