Rana Daggubati తండ్రి కాబోతున్నాడా? మర్మగర్భంగా మిహిక పోస్ట్ వైరల్!
కోవిడ్‌తో ప్రజలంతా భయభ్రాంతులవుతుంటే.. తన సన్నిహితులు, స్నేహితులు అభిమానులకు పెళ్లి వార్త చెప్పి రానా దగ్గుబాటి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న మిహికా తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొన్నదంటూ పోస్ట్ పెట్టడంతో జాతీయ మీడియాలో ఆ వార్త హల్‌చల్ అయ్యింది. అయితే అప్పటి నుంచి రానా, మిహిక దాంపత్యం సాఫీగా సాగిపోతున్నది. అయితే మిహిక పెట్టిన పోస్టు అనేక సందేహాలకు తెర లేపింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

రూమర్లకు తెర వేస్తూ..
రానా, మిహిక కాపురం సవ్యంగా సాగుతుంటే.. వారిపై కొన్ని పుకార్లు మీడియాలో వినిపించాయి. అయితే అలాంటి వార్తలన్నీ గాలివార్తలే అని ఈ సెలబ్రిటీ కపుల్ నిరూపించారు. వారిద్దరు అన్యోన్యంగా ఉంటూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ గాసిప్ వార్తలపై నీళ్లు చల్లారు.

పారిస్‌లో వివాహ వార్షికోత్సవం
రానా, మిహిక దంపతులు ఇటీవల వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు. అయితే పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. పారిస్ పర్యటనలో వారిద్దరు సెల్పీలతో హంగామా చేశారు. ఇదిలా ఉండగా, రానా దంపతులకు ఓ సంబంధించిన ఓ స్పెషల్ వార్త మీడియాలో వైరల్ అయింది.

రానా, మిహిక సెల్ఫీల హంగామా
మిహిక ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు రకరకాలుగా సందేహాలకు దారి తీసింది. కడ్వా చౌత్ సందర్భంగా పెట్టిన పోస్టులో రానా చేతిపై చేయి వేసింది. ఇద్దరి వెడ్డింగ్ రింగ్స్ ఫోటోలో హైలెట్ అయ్యాయి. రానా, మిహిక ఫోటోలపై అభిమానులు పలు రకాల కామెంట్స్ చేశారు. శుభ వేడుక సందర్భంగా శుభాక్షాంక్షలు అందించారు.

రానా కోసం ఫ్లయింగ్ కిస్
అయితే రానా ఫోటోలను షేర్ చేస్తూ.. రెండు హృదయాలు, ఇద్దరు వ్యక్తులు, రెండు చేతులు, ఒక ప్రామిస్. ఈ రోజే కాదు.. ఎప్పుడూ లవ్‌ను సెలబ్రేట్ చేసుకొంటున్నాం అంటూ కాప్షన్ పెట్టింది. అంతేకాకుండా ఓ ఫ్లయింగ్ కిస్‌ను కూడా రానాకు విసిరింది. దాంతో రానా తండ్రి కాబోతున్నాడని నెటిజన్లలో ఊహాగానాలు తలెత్తాయి. అయితే ఈ వార్త నిజమేనా అనేది తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

రానా కెరీర్ ఇలా..
రానా దగ్గుబాటి కెరీర్ విషయానికి వస్తే.. బాహుబలి తర్వాత ఆయన నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణను నోచుకోలేకోపోయాయి. అయితే ఆయన భారీగా ఆశలు పెట్టుకొన్న సినిమాలు నిరాశను కలిగించాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం రానానాయుడు అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా నటించడం విశేషంగా మారింది. ఈ ఇద్దరు కలిసి నటించడం ఇదే మొదటిసారి.


Click it and Unblock the Notifications











