»   » ఆ స్టార్ హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమిస్తున్న హీరో రాణా..

ఆ స్టార్ హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమిస్తున్న హీరో రాణా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు దగ్గుబాటి సురేష్ కుమారుడ, నటుడు 'రాణా" అందాల నటి 'ఇలియానా" మత్తులో పడ్డాడా?అంటే అవుననే చెబుతోంది ఇలియానా.! రాణా నా పిచ్చిలో పడ్డాడని ఇలియానా స్వయంగా చెప్పటం సినీ పరిశ్రమలో కొంచెం సంచటనంగానే ఉంది. 'నేను నా రాక్షసి" లో రాణా, ఇలియానా నటించిన తరువాత, శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'త్రీ ఇడియట్స్" షూటింగ్ ఊటీలో జరుగుతున్న సమయంలో 'రాణా" గురించి ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

రాణా నీతో పనిచేయటం నాకెంతో ఆనందంగా ఉంది. నీ పిచ్చి ప్రేమను మిస్ అయినందుకు నేనెంతో బాధపడుతున్నానని వ్రాసింది. అంటే దీని అర్థం 'రాణా" ఇలియానా ప్రేమలో పడి పిచ్చివాడైపోయాడని ఇలియానే స్వయంగా చెబుతోంది. 'నేను నా రాక్షసి"లో రాణాకు ఇలియానాతో నటించే అవకాశం వచ్చిన తర్వాత రాణా గాలిలో తేలిసోతున్నాడని, ఇలియానా కోసం రాణా లక్షలు ఖర్చు పెడుతున్నాడని ఫిలింనగర్ లో విపరీతంగా చెప్పుకుంటున్నారు.

కాగా ఇలియాన తన ట్విట్టర్ లో వ్రాసిన ప్రకారం, ఫిలిం నగర్ పుకార్లు నిజమేనని తెలుస్తుంది. ఇలియానాను ప్రసన్నం చేసుకోవడానికి, ఆమె కోరికలు తీర్చడానికి 'రాణా" ఎంత ఖర్చుకైనా స్థానం లభించిందనే పుకార్లు వస్తున్నాయి. అయితే ఇలియానా, రాణా ప్రేమను అంగీకరిస్తుందా లేద అనే విషయం అనుమానస్పదమేనని ఫిల్మింనగర్ గుసగుసలు. ఎందుకంటే సినిమా హీరోయిన్ల ప్రేమలు క్షణక్షణానికి ఊసరల్లిలా మారుతూ, అవకాశాన్ని బట్టి వాళ్ల ప్రేమలుంటాయని అందరికీ తెలిసిందే. ఇలియానా అయితే రాణా నా ప్రేమలో పడి పిచ్చివాడైయ్యాడు అనే విషయాన్ని మాత్రం బహిరంగంగానే ఒప్పుకొంటుంది. మరి ఈ ఒరిజినల్ ప్రేమ కథ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. రాణా ఇప్పటికే ఒక హీరోయిన్ ని ప్రేమించటం, తండ్రి డి సురేష్ ఆ గోలకు ఫుల్ స్టాప్ పెట్టించడం జరిగింది. ఇది రెండవ కేసు?మరి దీన్ని ఎలా పరిష్కరిస్తాడో చూడాల్సిందే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu