యానిమల్ సీక్వెల్ నుంచి రణబీర్ ఔట్.. ఆలియా చిచ్చుతో షాకింగ్ నిర్ణయం!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తికపూర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం యానిమల్. రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ తెచ్చుకున్న ఈ మూవీ సంచలన విజయం సాధించింది. రూ.200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని, 4000కు పైగా థియేటర్లలో రిలీజైన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 920 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ లాభాలను అందించింది. అలాంటి మూవీకీ సీక్వెల్ తీయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే హీరో రణబీర్ కపూర్ ఈ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా బీ టౌన్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

కాగా.. కొందరు హీరోలు, నిర్మాతలు బాలీవుడ్‌లో కార్పోరేట్ బుకింగ్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారని గాసిప్స్ వైరల్ అవుతుంటాయి. థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటే కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రత్యర్ధి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ లేటెస్ట్ మూవీ.. జిగ్రా.దసరా కానుకగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను అలియా భట్, కరణ్ జోహర్, అపూర్వ మెహత, షాహీన్ భట్, సోమేశ్ మిశ్రాలు నిర్మించారు. ఈ సినిమా రెండు రోజుల్లో ఇండియా వైడ్‌గా రూ.11.5 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే జిగ్రా మూవీకి వస్తున్న కలెక్షన్స్‌పై టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సతీమణి , నటి దివ్య ఖోస్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Is Ranbir Kapoor step down from Bhushan Kumar s Film After His Wife Divya Khossla comments on Alia Bhatt

తాను జిగ్రాను చూసేందుకు వెళ్లానని .. థియేటర్ మొత్తం ఖాళీగా ఉందని, కానీ కలెక్షన్స్ ఎక్కడి నునంచి వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. ఫేక్ వసూళ్లను ప్రకటిస్తున్న అలియా భట్ ధైర్యాన్ని మెచ్చుకోవాలని.. జనాన్ని వెర్రివాళ్లను చేయొద్దని దివ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీనికి మౌనమే మూర్ఖులకు సమాధానమంటూ కరణ్ జోహర్ కౌంటరిస్తారు. ఆ వెంటనే మరో పోస్ట్‌లో మీకు దొంగిలించడం అలవాటంటూ ధీటుగా బదులిచ్చింది దివ్య.

అయితే దివ్య గతంలో నటించిన సవి సినిమాకు దగ్గరకు జిగ్రా ఉండటంతో పాటు తన భర్త భూషణ్ కుమార్ నిర్మించిన లేటెస్ట్ మూవీ విక్కీ విద్యా కో వో వాలా వీడియో సినిమాకు పోటీగా జిగ్రా వచ్చిందనే అక్కసుతోనే ఖోస్లా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వివాదంపై అలియా భట్ స్పందించలేదు. కానీ చర్యకు ప్రతి చర్య ఉన్నట్లుగానే దివ్య ఖోస్లాకు షాకిచ్చే పరిణామాలు తెరవెనుక జరుగుతున్నాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Is Ranbir Kapoor step down from Bhushan Kumar s Film After His Wife Divya Khossla comments on Alia Bhatt

దీనిలో భాగంగానే యానిమల్ 2 నుంచి రణబీర్ కపూర్ తప్పుకోవాలని డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. యానిమల్‌‌లో టీ సిరీస్ కూడా భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ కావడంతో భూషణ్ కుమార్ మంచి లాభాలను అందుకుని సీక్వెల్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాంటి దశలో దివ్య ఖోస్లా కారణంగా ఆయన అంచనాలు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని బీటౌన్‌లో గుసగుసలు జోరందుకున్నాయి. నిజంగానే రణబీర్ కపూర్ యానిమల్ 2 నుంచి తప్పుకున్నారా ? లేక ఇవన్నీ గాలి వార్తలేనా? అన్నది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X