twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊర మాస్ రంగస్థలానికి, మెగాస్టార్ సినిమాకు లింకేంటి?: చిరంజీవి నిజంగా అలా అన్నారా?

    |

    'రంగస్థలం 1985..' టైటిల్ తోనే అందరిని ఎట్రాక్ట్ చేసిన ఈ చిత్రం చుట్టూ చాలానే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాతో సుకుమార్ అందరిని 1985లోకి తీసుకెళ్తాడనేది అర్థమవుతూనే ఉంది. అయితే ఈ సినిమా ఛాయలు ఒకప్పటి చిరంజీవి సినిమాకు దగ్గరగా ఉండబోతున్నాయా? అన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

    Recommended Video

    ‘రంగస్థలం’ హాట్ న్యూస్ చెప్పిన చరణ్... !

    1981లో వచ్చిన చిరంజీవి 'ఊరికిచ్చిన మాట' సినిమాతో రంగ స్థలం సినిమాకి పోలిక తెస్తున్నారు. రంగస్థలంలో కొన్ని సన్నివేశాలు 'ఊరికిచ్చిన మాట' సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊర మాస్ లా కనిపిస్తున్న 'రంగ స్థలం'కు, ఊరికిచ్చిన మాట సినిమాకు వినిపిస్తున్న లింకులపై మరిన్ని ముచ్చట్లు..

    ఊరమాస్ 'రంగ స్థలం':

    ఊరమాస్ 'రంగ స్థలం':

    రంగ స్థలం పోస్టర్స్ చూస్తుంటే.. చరణ్‌ను సుకుమార్ ఊర మాస్‌గా చూపిస్తారనేది తెలిసిపోతూనే ఉంది. అయితే ఊరికిచ్చిన మాట సినిమాలోని సన్నివేశాలను కాపీ కొట్టాల్సిన అవసరం ఆయనకు నిజంగా ఉందా? అంటే కచ్చితంగా కాదనే చెప్పాలేమో!

    సుకుమార్ కాపీ కొట్టే దర్శకుడా?:

    సుకుమార్ కాపీ కొట్టే దర్శకుడా?:

    నిజానికి సుకుమార్ సినిమాలకు మిగతా దర్శకుల సినిమాలకు కాస్త భిన్నంగా కనిపించేది 'స్క్రీన్ ప్లే'నే. రొటీన్, ముతక సన్నివేశాలకు ఆయన కాస్త దూరంగానే ఉంటారు. వీలైనంత వరకు సీన్‌ను కొత్త ట్రీట్‌మెంట్ తో స్క్రీన్ పైకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. అలాంటి సుకుమార్ ఒకప్పటి సినిమాలోని సన్నివేశాలను కాపీ కొడుతాడని ఊహించలేం. అయితే స్పూర్తిగా తీసుకుని ఉంటారన్న వాదనను కూడా పూర్తిగా ఏకీభవించలేం.

    ఊరికిచ్చిన మాట:

    ఊరికిచ్చిన మాట:

    1981లో విడుదలైన ఊరికిచ్చిన మాట అప్పట్లో మంచి విజయం సాధించింది. చిరంజీవి-సుధాకర్ అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమాలో ఊరి కోసం తాపత్రయపడే అన్న పాత్రలో చిరంజీవి కనిపిస్తారు. ఆ నేపథ్యంలోనే తమ్ముడిని డాక్టర్ చదివించి.. గ్రామంలోనే ఒక ఆసుపత్రి పెట్టించాలనుకుంటాడు.

    అలా ఊరివాళ్లంతా కలిసి చేసిన ఆర్థిక సహాయంతో సుధాకర్ పట్నం వెళ్లి డాక్టర్ చదువు పూర్తి చేస్తాడు. కానీ అన్నకు, ఊరికి ఇచ్చిన మాటను విస్మరించి పట్నంలోనే డాక్టరుగా స్థిరపడుతాడు. తనను డాక్టర్‌ను చేసిన ఊరిని మరిచిపోయిన తమ్ముడికి అన్న ఎలా కనువిప్పు కలిగించాడనేది ఆ తర్వాతి సినిమా.

    చిరంజీవి అలా అన్నారా?:

    చిరంజీవి అలా అన్నారా?:

    రంగస్థలం రషెస్ చూసిన చిరంజీవి.. తన పాత సినిమా 'ఊరికిచ్చిన మాట'లోని సన్నివేశాలను గుర్తుకుతెచ్చేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని చెప్పారట. అంతేకాదు, కొన్ని సీన్స్ ను రీషూట్ చేయాలని కూడా చెప్పారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    రంగస్థలం చుట్టూ పుకార్లు

    రంగస్థలం చుట్టూ పుకార్లు

    'రంగస్థలం', 'ఊరికిచ్చిన మాట' సినిమాల మధ్య అసలు పోలిక తెచ్చిందెవరన్న ప్రశ్నకు 'చిరంజీవి' పేరే సమాధానంగా వినిపిస్తుండటం గమనార్హం. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియదు గానీ మొత్తానికి రంగస్థలం చుట్టూ ఈ పుకార్లు బాగానే షికారు చేస్తున్నాయి.

    English summary
    Lot of rumours are coming up about the story of Rangasthalam movie. The latest buzz is that ‘Rangasthalam’ is being touted as a silent remake of the movie ‘Ooriki Ichchina Maata’ which had megastar Chiranjeevi. This film released in 1985.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X