»   » నిత్య రాసలీలల రంజిత తెలుగు యువతా?

నిత్య రాసలీలల రంజిత తెలుగు యువతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళులకు తెలుగు వారి కంటే భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ఎక్కువ. ఎవరైనా గొప్ప విజయాలు సాధిస్తే వారు తమిళులని, ఎవరైనా భ్రస్టుపడితే వారు పక్క రాష్ట్రాల వారని తమిళ మీడియా ప్రచారం చేస్తుంటుంది. నిత్యానంద స్వామితో రాసలీఅలు సాగిస్తూ దొరికిపోయిన ఒకనాటి హీరోయిన్ రంజిత తెలుగమ్మాయి అని తమిళ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆమె స్పష్టంగా తమిళం మాట్లాడగలదు కానీ తెలుగు మాట్లాడలేదని ఆనేక క్లిప్స్ ద్వారా నిరూపితమవుతోంది.

రంజిత "శ్రీ రాములయ్య" వంటి కొన్ని తెలుగు సినిమాల్లోనటించింది. ఆమె నిజంగా తెలుగు అయితే హైదరాబాద్ లో ఎందుకు ఉండట్లేదు? ఆమెకు ఉన్న రెండు బంగళాలు చెన్నైలోనే ఉన్నాయి. ఒక ఆర్మీ ఆఫీసర్ ను పెళ్ళి చూసుకుని అనేక కారణాల వల్ల ఆమె ఆయనకు దూరంగా నిత్యానంద స్వామి వంటి వారికి దగ్గరగా ఉంటోంది. హైదరాబాద్ లో ఉన్న తన సహ నటి ఇంట్లో తలదాచుకుంటున్న రంజిత సెక్స్ స్కామ్ బయటపడిన తర్వాత రెండు సార్లు ఆత్మహత్యా యత్నం చేసినట్టు తెలుస్తోంది. ఆమె చెన్నై నివాసం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఆమె కన్పించిన వెంటనే అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu