Mokshagna Teja: మోక్షజ్ఞకు జంటగా స్టార్ హీరోయిన్ కూతురు.. నందమూరి వారసుడి జోడి ఎవరో తెలుసా?

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహ నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తేజ తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రీకి రంగం సిద్దమవుతున్నది. గత కొద్ది నెలలుగా నందమూరి అభిమానులు ఈ యువ హీరో రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొంటూ సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మోక్షజ్ఞకు జంటగా నటించే హీరోయిన్ ఎంపిక పూర్తయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ గురించి కొద్ది నెలలుగా రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. చివరకు హనుమ్యాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ లాంచ్‌కు రంగం సిద్దమైందనే వార్తను కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. బాలయ్య బాబు కూడా తన కుమారుడి ఎంట్రీ గురించి అఫిషియల్‌గా కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. దాంతో నందమూరి ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది.

Is Rasha Thadani to pair Nandamuri Mokshagna Teja for Prashanth Varma Movie

అయితే మోక్షజ్ఞ తేజ ఫోటోషూట్ విడుదల తర్వాత ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నందమూరి నట వారసుడికి కావాల్సిన అన్నీ హంగులు ఆయన లుక్‌తో క్లారిటీ వచ్చేసింది. మోక్షజ్ఞ లుక్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది. దాంతో ఆయన సినిమా ఎప్పుడెప్పుడూ ప్రారంభమవుతుందా అనే ఆసక్తి పెరిగింది.

మోక్షజ్ఞ తేజ సరసన నటించే యువ హీరోయిన్ గురించి చాలా మందిని లుక్ టెస్ట్ చేశారు. అయితే శ్రీలీలతోపాటు చాలా మంది అమ్మాయిల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ చివరకు బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ కుమార్తెను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఆ అమ్మాయి హిందీలో ఓ సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరనే వివరాల్లోకి వెళితే..

Is Rasha Thadani to pair Nandamuri Mokshagna Teja for Prashanth Varma Movie

మోక్షజ్ఞకు జంటగా నటించబోయేది రవీనా టాండన్, బాలీవుడ్ నిర్మాత తడానీ కుమార్తే రషా తడానీ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అధికారికంగా వెల్లడి కాకపోయినా.. ఆమె ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. ఆమెను ఫైనల్ చేశారు. ఓ ముహుర్తం చూసి సరైన సమయంలో అధికారికంగా ప్రకటిస్తారు అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రషా తడానీ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాత కూతురిగా, స్టార్ హీరోయిన్ అమ్మాయిగా మంచి పేరు ఉంది. ఇటీవల ఆజాద్ అనే సినిమా ద్వారా హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో హీరోగా ఆమన్ దేవగన్‌ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X