RC16 రాంచరణ్‌తో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కూతురు రొమాన్స్.. ఎవరీ రషా తడానీ?
RRR మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా కాస్త ఆలస్యమే అవుతున్నప్పటికీ.. శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఓ వైపు గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు RC16 మూవీ కోసం రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ కూతుర్ని తన మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఆ టాప్ సీనియర్ హీరోయిన్ ఎవరు? రాంచరణ్ పక్కన నటించబోయే తార ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
జెంటిల్మన్, అపరిచితుడు, ఒకే ఒక్కడు లాంటి ఎన్నో సంచలన చిత్రాలను అందించిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న గేమ్ చేంజర్ దాదాపు ముగింపు దశకు చేరుకొంటున్నది. అయితే అభిమానలు వెయిటింగ్‌లో పెట్టిన రాంచరణ్.. మరో సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

రాంచరణ్ నటించబోయే RC16 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ కోసం పలువురిని సంప్రదించడమే కాకుండా లుక్ టెస్ట్ చేస్తున్నారు.
RC15 మూవీ కోసం లుక్ టెస్ట్ కోసం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీకి ఇటీవల లుక్ టెస్ట్ చేశారు. లుక్ టెస్ట్ కోసం రషా తడానీ ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ ఆ పాత్ర కోసం లుక్‌ను రషా తడానీతో టెస్ట్ చేశారు. అయితే దాదాపు రషా తడానీ ఎంపిక దాదాపు ఫైనల్ అయినట్టు సమాచారం.
రషా తడానీ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, డిస్టిబ్యూటర్ అనిల్ తడానీ, రవీనా టాండన్ కూతురు. రషా తడానీ అసలు పేరు రషా విశాఖ తడానీ. 2005 మార్చి 16వ తేదీన జన్మించింది. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నారు. టైక్వాండో మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించింది.

ఇక హీరోయిన్ రవీనా టాండన్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా అందరికి తెలిసిందే. తెలుగులో కూడా ఆమె సుపరితులు. తెలుగులో బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జునతో కలిసి ఓ చిత్రంలో నటించారు. తాజాగా కేజీఎఫ్2 చిత్రం ద్వారా ఆమె పవర్‌ఫుల్ ప్రధాని పాత్రలో ఆమె ఆకట్టుకొన్నారు. ఇటీవల ఆమె నటించిన చిత్రాలు హిందీలో మంచి విజయాలు సాధించాయి.


Click it and Unblock the Notifications











