రష్మిక మందన్నా- విజయ్ దేవరకొండ పెళ్లికి భారీ ఏర్పాట్లు... వీడియో లీక్, పెళ్లి ఎప్పుడంటే?

కొత్త సంవత్సరంలో సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇప్పటి వరకు ప్రేమలో ఉన్న నటీనటులు, ఇతర సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ లిస్ట్ భారీగానే ఉంది. ఈ వరుసలో ముందుగా వినిపిస్తున్న పేర్లు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న. గత కొన్నేళ్లుగా సీక్రెట్‌గా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతేడాది ఏకంగా ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ ఎక్కడా వీరిద్దరూ అధికారికంగా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ మీడియాలో మాత్రం వీరిద్దరి పెళ్లి డేట్ గురించి రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయ్ - రష్మికల వివాహానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

గీత గోవిందం సినిమాతో ప్రేమాయణం
గీత గోవిందం సినిమాలో తొలిసారిగా విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కలిసి నటించారు. ఈ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలై, ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విజయ్, రష్మికలు సీక్రెట్‌గా డేట్స్, పార్టీలు, విహారయాత్రలకు వెళ్లేవారు. వీరు షేర్ చేసిన ఫోటోలలోని బ్యాక్‌గ్రౌండ్స్ ఒకేలా ఉండటంతో మీడియాకు అనుమానం వచ్చి గట్టి నిఘా పెట్టింది. పలుమార్లు ఎయిర్‌పోర్ట్స్, రెస్టారెంట్స్‌లో వీరిద్దరూ మీడియా కెమెరాలకు చిక్కారు. అయినప్పటికీ విజయ్ కానీ, రష్మిక కానీ తమ బంధాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. ఈ దశలో గతేడాది అక్టోబర్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలకు నిశ్చితార్ధం జరిగిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఫోటోలు కానీ, ఇతర వివరాలు కానీ ఈ జంట బయటపెట్టలేదు.

Is Rashmika Mandanna and Vijay Deverakonda getting married on Feb 2 Udaipur Palace Video goes viral

విజయ్‌తో పెళ్లిపై రష్మిక క్లారిటీ
అయితే విజయ్, రష్మికల చేతికి ఒకేరకమైన ఉంగరాలు ఉండటంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్లయ్యింది. అటు విజయ్‌తో పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌పై రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ వార్తలు ధ్రువీకరించలేను, అలాగని ఖండించలేను, పెళ్లి గురించి ఎప్పుడు బయటపెట్టాలో? ఎక్కడ మాట్లాడాలో? అప్పుడు ఖచ్చితంగా చెబుతానని హింట్ ఇచ్చారు. ఇక ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్‌మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విజయ్ .. రష్మిక చేతిని ముద్దాడారు. ప్రతి అమ్మాయి జీవితంలో విజయ్ లాంటి వ్యక్తి ఉండాలని రష్మిక.. తోటివారు సంతోషంగా ఉండాలని రష్మిక కోరుకుంటూ ఉంటారని విజయ్.. ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని బయటపెట్టారు.

విజయ్ - రష్మిక పెళ్లి డేట్ ఇదేనా?
మరోవైపు.. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ప్రఖ్యాత ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరుగుతుందని మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. ఎంగేజ్‌మెంట్‌ను సీక్రెట్‌గా జరుపుకున్న ఈ జంట.. పెళ్లిని మాత్రం గ్రాండ్‌గా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరినీ ఆహ్వానించాలని వీరు భావిస్తున్నారట. రాజస్థాన్‌లో పెళ్లి జరిగినా.. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించే యోచనలో ఉందని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.

విజయ్ - రష్మిక పెళ్లికి భారీ ఏర్పాట్లు
అయితే అనూహ్యంగా విజయ్ దేవరకొండ- రష్మికల పెళ్లి ఫిబ్రవరి 2వ తేదీ.. అంటే రేపే జరగనుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరుగుతున్న భారీ ఏర్పాట్లపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన ఇద్దరు యువతులు మాట్లాడుకుంటూ.. ఇక్కడ ఫిబ్రవరి 2వ తేదీన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లి జరగబోతోందని ఓ వీడియో విడుదల చేశారు. అంతేకాదు.. ప్యాలెస్‌లో జరుగుతున్న పెళ్లి ఏర్పాట్లను వీడియో తీసి చూపించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. కనీసం ఎవరికీ ఆహ్వాన పత్రిక లాంటివి లేకుండా విజయ్ - రష్మికలు పెళ్లి చేసుకుంటారా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 2వ తేదీన ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. అక్కడే 26వ తేదీన పెళ్లి చేసుకోవాలని విజయ్ - రష్మికలు భావిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X