మళ్లీ ప్రేమలో పడ్డ రష్మిక మందన్న?.. డేటింగ్ చేస్తున్నట్టు..
అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్‌లో సక్సెస్‌ల జోరును కొనసాగిస్తున్నది. తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం అదృష్టరేఖగా మారింది. ఇలా విజయాలతో దూసుకుపోతున్న రష్మిక జీవితంలో తన ప్రియుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం బ్రేకప్ కావడం ఆమెను ఓ కుదుపు కుదిపేసింది. తన బ్రేకప్ వార్త తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో సంచలనం రేపింది. అయితే రష్మిక మళ్లీ ప్రేమలో పడ్డారనే విషయం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

సక్సెస్ జోరుతో రష్మిక మందన్న
తెలుగులో ఛలో మూవీతో కెరీర్ ప్రారంభించింది. గీతా గోవిందం బ్లాక్‌బస్టర్ కావడంతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత దేవదాస్ కూడా సక్సెస్ అందుకోవడంతో మరింత జోష్ పెరిగింది. ఈ క్రమంలోనే రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వార్త వెలుగు చూసింది. దాంతో సినీ వర్గాలు షాక్ అయ్యాయి.

బ్రేకప్‌తో న్యూస్‌తో షాకింగ్
రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత రష్మిక ఇప్పడిప్పుడే బ్రేకప్ విషాదం నుంచి కోలుకొంటున్నది. గీతా గోవిందం, దేవదాస్ విజయాలు ఆమెకు కొంత ఊరట కలిగించాయి. ప్రస్తుతం నితిన్‌తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్మిక వ్యవహారం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సమయంలో మరో వార్త వెలుగు చూసింది.

హీరోతో చనువుగా ఉంటుందా?
రష్మిక మందన్న మళ్లీ ప్రేమలో పడింది. డేటింగ్ చేస్తున్నదంటూ ఓ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓ హీరోతో చనువుగా ఉంటుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వాటిపై పెద్దగా క్లారిటీ లేదు. అయితే ఆమె సన్నిహితులు అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే బ్రేకప్ విషాదం నుంచి బయటపడుతున్నారు. ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని పేర్కొన్నారు.

విజయ్ దేవరకొండతో బిజీగా
బ్రేకప్, సక్సెస్ మధ్య రష్మిక స్టడీగా కెరీర్ గ్రాఫ్ పెంచుకొంటున్నది. గీతా గోవిందం సినిమా తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండతో జతకట్టింది. వారిద్దరూ నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నితిన్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











