కల్కిలో దిశా పటానీ రోల్.. మిస్ చేసుకొన్న తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏమిటంటే?
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర అదరగొడుతున్న ఏకైక సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఎపిక్ బ్లాక బస్టర్ హిట్ చిత్రం కల్కి 2898 ఎడి అనే చెప్పాలి. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ ఎపిక్ వండర్ లో సాలిడ్ కాన్సెప్ట్ తో పాటుగా ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా భారీ తారాగణం కూడా కనిపిస్తుంది. కాగా ఈ తారాగణంతో ప్రభాస్ సరసన నటించిన దిశా పటాని కూడా మంచి అట్రాక్షన్ గా నిలిచింది.
కాకపోతే సినిమాలో కేవలం కొంత మేర మాత్రమే ఆమె కనిపించడంతో కేవలం నామమాత్రంగానే ఉందని టాక్ కూడా వచ్చింది. అయినప్పటికీ ప్రభాస్ తో ఉన్న ఒకే ఒక్క పాటలో కూడా ఆమెతోనే ఉండడం ఆ పాట కూడా మంచి రెస్పాన్స్ ని ఇపుడు అందుకోవడం అభిమానుల్లో వైరల్ గా మారింది. మెయిన్ గా ఈ సాంగ్ లో దిశా గ్లామర్ షో అయితే బిగ్ హైలైట్ గా మారింది.

ఇంకా సినిమాలో తన ఫిజిక్ తో కూడా బాగా మెస్మరైజ్ చేసింది. కానీ ఇది మీకు తెలుసా నిజానికి ఈ సినిమాలో రోక్సి పాత్రకి దిశా పటాని మొదటి ఛాయిస్ కాదట. ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ని అనుకున్నారని కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. కాగా ఆ హీరోయిన్ ఎవరో కూడా కాదు పాన్ ఇండియా క్రష్ రష్మికా మందన్నా అట. ఆమె ఈ పాత్రలో చేయాల్సి ఉందట.
కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం ఇంకా ఇతర కమిట్మెంట్స్ మూలాన ఆమె సినిమాలో భాగం కాలేకపోయింది అని కారణం ఒక వెర్షన్ గా వినిపిస్తుంది. ఇక ఇంకొక వెర్షన్ లో అయితే ఇపుడు ఎలా అయితే సినిమాలో దిశా రోల్ కి సినిమాలో పెద్దగా స్కోప్ లేదని టాక్ వచ్చిందో అదే రకంగా తనకి ఈ సినిమాలో స్కోప్ లేదని రిజెక్ట్ చేసింది అని కూడా వినిపిస్తుంది.

అప్పటికే రష్మిక అనిమల్, పుష్ప లాంటి సాలిడ్ రోల్స్ ఉన్న సినిమాలు ఓకే చేసి ఉంది కానీ ఇందులో అలాంటి స్కోప్ లేకపోవడంతో ఈ భారీ సినిమా ఆఫర్ కాదనుకుంది అని మరో టాక్. అయితే ఈ సినిమాలో దిశా రోల్ తప్ప మిగతా చిన్న చిన్న పాత్రలకి కూడా పెర్ఫామెన్స్ పరంగా మంచి స్కోప్ కనిపిస్తుంది. సో రష్మిక ఈ అఫర్ ఆఫర్ ని రిజెక్ట్ చేసినా అందులో పెద్ద ఆశ్చర్యం లేదనే అనుకోవాలి.
కాగా ఈ చిత్రంలో ప్రభాస్ దిశా సహా దీపికా పదుకొనె, అమితాబ్, ఉలగనయగన్ కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ కూడా నటించగా రాజేంద్ర ప్రసాద్, శోభన లు కూడా కీలక పాత్రలు చేశారు. అలాగే యంగ్ సెన్సేషన్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ ఇంకా విజయ్ దేవరకొండ కూడా ఈ సైన్స్ ఫిక్షన్, మైథలాజి వండర్ లో నటించారు.


Click it and Unblock the Notifications











