అల్లు అర్జున్‌తో మరోసారి రష్మిక మందన్న.. రాకాలో నేషనల్ క్రష్ పాత్ర ఏమిటంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి తర్వాత సక్సెస్ జర్నీని, సినిమాల వేగాన్ని ఉధృతం చేసింది. ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారీ బడ్జెట్ చిత్రాలతోపాటు, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొనేందుకు భారీ స్కెచ్ వేస్తున్నది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మరోసారి జతకట్టేందుకు రెడీ అవుతున్నది. అయితే రాకా సినిమాలో రష్మిక పోషించే పాత్ర ఏమిటి? ఆమె పెట్టిన డిమాండ్స్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

రష్మిక గత రెండేళ్లుగా అటు హీరోయిన్‌గా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలత తన సత్తాను మరోసారి రుజువు చేసుకొన్నది. పుష్ప, యానిమల్, ఛావా, గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో తనకంటే ఇమేజ్ క్రియేట్ చేసుకొన్నారు. నేషనల్ క్రష్‌గా భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్నారు. ఇటీవల కాక్‌టెయిల్ 2 సినిమాతో గ్లామర్ హీరోయిన్‌గా తనకు స్టార్ డమ్‌కు చెక్కు చెదరలేదని నిరూపించుకొన్నారు. పెళ్లి తర్వాత రణబాలి సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.

Rashmika Mandanna in Raaka

అయితే ప్యాన్ ఇండియాకు మించి సినిమాగా తెరకెక్కుతున్న రాకా సినిమాలో అల్లు అర్జున్‌తో జతకట్టేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ముంబైలో జరిగి షూటింగులో పాల్గొననున్నారు. అట్లీ దర్శకత్వంలో ఇండియన్ సినిమాలో ఊహించని టెక్నాలజీతో కంటెంట్ ప్రధాన చిత్రంగా రూపొందే ఈ మూవీలో రష్మిక పాత్ర కీలకమైనదనే వార్త బయటకు పొక్కింది.

రష్మిక మందన్నను ఇప్పటి వరకు హీరోయిన్ ఓరియెంటెడ్, గ్లామర్ తారగా చూసిన వారికి నేషనల్ క్రష్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారనే వార్త జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో ఆమె విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఆ క్యారెక్టర్ ఎమోషనల్ డ్రైవ్‌గా ఉంటుంది. రష్మిక యాక్టింగ్ స్టామినాకు కొలమానంగా నిలుస్తుంది అని సినీ వర్గాలు చెప్పుకొంటున్నారు.

రాకా చిత్రంలో ఆఫర్ వచ్చిన సమయంలో తన పాత్రకు ప్రాధాన్యం ఉండాలనే కండిషన్ పెట్టింది. అయితే లేడీ పాత్రలను తెరపైన చూపించడంలో అట్లీకి ప్రత్యేక శైలి ఉంది. అందుకు తగినట్టుగానే రష్మిక పాత్రను డిజైన్ చేశారు. దాంతో సంతృప్తి చెందిన ఆమె ఆ పాత్రలో వైవిధ్యాన్ని చూపించేందుకు ప్రిపరేషన్ మొదలుపెట్టారు అనే విషయం బయటకు వచ్చింది.

దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై సుమారుగా 700 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నతోపాటు దీపిక పదుకోన్, మృణాల్ థాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే అధికారికంగా ఎలాంటి ధృవీకరణ జరగలేదు. ఇక రష్మిక రాకా, రణబాలితోపాటు మైసా అనే చిత్రంలోకూడా నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X