సందీప్ రెడ్డి వంగ మూవీని రష్మిక రిజెక్ట్ చేసిందా? ఆ బిగ్ ప్రాజెక్ట్‌ను వదలుకొన్నదా?

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ అంతటినీ షేక్ చెయ్యగలిగే కొన్ని క్రేజీ కాంబినేషన్ లలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచే దాదాపు కనిపిస్తాయి. కానీ ఈ అన్నిట్లో కూడా ఆ రేంజ్ పొటెన్షియల్ ఉన్న సినిమాలు కావాలి అంటే ఖచ్చితంగా ప్రభాస్ రేంజ్ దర్శకుడు కూడా ఉండాల్సిందే. మరి అలాంటి మెంటల్ మాస్ దర్శకుడుతోనే ప్లాన్ చేసిన మెంటల్ మాస్ చిత్రమే "స్పిరిట్".

తెలుగు సినిమాకి ఒక కొత్త దర్శకత్వాన్ని పరిచయం చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో ఈ సినిమా అనౌన్స్ అయ్యే సుమారు మూడేళ్లు అవుతున్నట్టు ఉంది. కాగా అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కాగా ఇపుడు ఈ బిగ్గెస్ట్ కలయికలో సినిమా త్వరలోనే స్టార్ట్ అయ్యేందుకు సిద్ధం రెడ్డి వంగ లొకేషన్స్ రెక్కీలో కూడా ఉన్నారు.

Rashmika Mandanna

ఇలా అన్నీ సెటప్ చేసుకుంటున్న ఈ సినిమాలో నటీనటుల పరంగా క్రేజీ పేర్లే కొన్నాళ్ల నుంచి వినిపిస్తూ వచ్చాయి. కాగా ఇలా ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది మంచి సస్పెన్స్ గా మారగా. పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు ఆ మధ్య వినిపించాయి. కాగా ప్రభాస్ తో కల్కి 2898 ఎడి లో నటించిన దీపికా పదుకోన్ పేరు అలాగే సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమా హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు కూడా ఇక్కడ వినిపించాయి.

కాగా ఇలా ఎవరి సినిమాల హీరోయిన్స్ పేర్లు ప్రభాస్, సందీప్ కాంబినేషన్ పై వినిపించాయి. కానీ సందీప్ మాత్రం రష్మికనే స్టిక్ చేసినట్టు కొంత కాలం టాక్ నడించింది. కానీ తాజా రిపోర్ట్స్ ట్విస్ట్ ఇచ్చాయి. సందీప్ రెడ్డి వంగ రష్మికనే అనుకుంటున్నప్పటికీ రష్మిక మాత్రం ఈ సినిమా చేసేందుకు అంత ఆసక్తిగా లేదు అని తెలుస్తుంది. దీనితో ఈ సినిమా నుంచి ఆమె బయటకి వచ్చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇక దీనితో మేకర్స్ మరో బ్యూటీని వెతుక్కునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాగా ఇలాంటి భారీ కాంబినేషన్ ని వద్దు అనుకోవడం వెనుక రష్మికకి ఎలాంటి కారణం ఉందో తెలియాల్సి ఉంది మరి. ప్రస్తుతం అయితే పాన్ ఇండియా లెవెల్లో రష్మిక తన హవా చూపిస్తూ దూసుకెళ్లిపోతుంది. అలాగే ఇపుడు స్పిరిట్ కి మిస్ అయ్యినా నెక్స్ట్ మాత్రం సందీప్ సెన్సేషనల్ సీక్వెల్ స్పిరిట్ లో డెఫినెట్ గా రష్మిక ప్రెజెన్స్ కనిపించనుంది.

ఇక లేటెస్ట్ గానే బాలీవుడ్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత చేసిన సికందర్ సినిమా మాత్రం రష్మిక కెరీర్లో డిజప్పాయింట్ చేసింది. ఇక ఈ సినిమాలు కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా రష్మిక ఫుల్ బిజీగా ఉంది. అలాగే స్పిరిట్ సినిమాకి ప్రస్తుతం ప్రభాస్ నుంచి డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. అవి వస్తే వెంటనే స్టార్ట్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నాడు. అలాగే కొరియన్ బాలయ్య డాన్ లీ కోసం కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X