సమంత గోల్డెన్ ఛాన్స్‌ను లాగేసుకున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోరు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలన్నింటికీ ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ రష్మికనే అనుకుంటున్నారు. అలాగే యంగ్ హీరోలు సైతం ఈ బ్యూటీతో రొమాన్స్ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత ఛాన్స్ ను తాజాగా రష్మిక కొట్టేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏ మూవీలో సమంత ప్లేస్ ను రష్మిక రీప్లేస్ చేసింది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
మయోసైటటిస్ కోసం తీసుకున్న బ్రేక్ తర్వాత సమంత ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ఆమె సినిమా నుంచి బ్రేక్ తీసుకోవడానికంటే ముందే ఒప్పుకున్నది. ఇక రీసెంట్ గా సామ్ పుట్టినరోజు సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నట్టుగా ప్రకటించింది.

ఈ రెండు సినిమాలు మినహా సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇటీవల షారుక్ ఖాన్ నెక్ట్స్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది అంటూ రూమర్లు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇక అంతలోనే సమంత నటించిన ఓ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ రష్మిక మందన్నను వరించిందని తెలుస్తోంది. నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ సూపర్ హారర్ కామెడీ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని టాక్ నడుస్తోంది. ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ అండ్ హారర్ ఎంటర్టైనర్ షూటింగ్ 2024 చివర్లో మొదలు కాబోతోంది.

వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ సినిమా గురించిన మిగతా వివరాలు ఇంకా బయటకు రాలేదు. అలాగే దీనిపై చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే ముందుగా ఈ సినిమా కోసం సమంతతో వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ టీం చర్చలు జరిపినట్టుగా వార్తలు వినిపించాయి. కానీ తాజాగా జరుగుతున్న ప్రచారం చూస్తుంటే సమంత ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని అనిపిస్తోంది.
దీంతో హిందీ చిత్ర పరిశ్రమంలో తనదైన ముద్ర వేస్తున్న రష్మిక మందన్న ఈ సినిమాలో నటించడానికి మార్గం సుగమం అయింది. యానిమల్ సక్సెస్ తర్వాత రష్మిక చేతిలో మూడు బాలీవుడ్ ప్రాజెక్టులో పడడం విశేషం. అందులో చావా, సికిందర్, ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఉంది. అయితే షారుక్ ప్రాజెక్ట్ కోసమే సమంత ఈ సినిమాను పక్కన పెట్టిందని టాక్ నడుస్తోంది. మరి ఈ రెండు వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











