రష్మిక మందన్న మాస్టర్ ప్లాన్.. టచ్ చేయని రేంజ్ కెళ్లిన నేషనల్ క్రష్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ సరసన నటించిన రష్మిక మందన్న... శ్రీవల్లి పాత్రలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత నుంచి రష్మిక మందన్నకు నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా దక్కింది. ఇక అప్పటినుంచి కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ చిత్రాలోనూ తన సత్తా చాటుతోంది. అక్కడ కూడా స్టార్ హీరోలతో నటిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటుంది.
రష్మిక మందన్న చివరిగా నటించిన మూడు భారీ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన యానిమల్ చిత్రం, ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్, ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చావా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రష్మిక మందన్న పేరు మారి మోగిపోతుంది. ఈ చిత్రాలతో ఏకంగా బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఫలితంగా రష్మిక మందన్న బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

అయితే తాజాగా రష్మిక మందన్న బాలీవుడ్ లో రూపుదిద్దుకున్న సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన తండ్రి వయసు ఉన్న సల్మాన్ ఖాన్ సరసన నటించి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది రష్మిక మందన్న. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది. దీంతో రష్మిక మందన్న తన రాబోయే చిత్రాలకు ఇకపై రెమ్యూనిరేషన్ ను తీసుకోవద్దని నిర్ణయించుకున్నదని టాక్ వినిపిస్తోంది.
రెమినరేషన్ కు బదులు ఏకంగా సినిమా ప్రాఫిట్ లో 10 శాతం వాటా కావాలని డిమాండ్ చేస్తున్నట్టు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే రష్మిక మందన్న నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో నిర్మాతలు కూడా అందుకు ఓకే అని చెప్పే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది. అయితే ఇలా లాభాల్లో షేర్లు తీసుకునే పద్ధతి కేవలం హీరోలకు మాత్రమే ఉండింది. కానీ ఇప్పుడు రష్మిక మందన్న కూడా అదే బాటలో పయనించబోతుండడం సెన్సేషన్ గా మారింది.
ఇక రష్మిక మందన్న తాజా చిత్రం సికిందర్ మొదటి రోజే రూపాలు 59 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక గతంలో యానిమల్ 700 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. పుష్ప 2 అయితే.. 1870 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన 2వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక చావా 800 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సెన్సేషన్ గా మారింది. ఇలా భారీ కలెక్షన్లు ఉన్న చిత్రాలు తన ఖాతాలో ఉండడంతో రష్మిక మందన్న తన రెమ్యూనరేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారంటూ టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, తామ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











