»   »  ఆ వ్యక్తుల చేతిలో రష్మిక మందన్న కీలుబొమ్మ? బ్రేకప్ వెనుక అసలు నిజం!

ఆ వ్యక్తుల చేతిలో రష్మిక మందన్న కీలుబొమ్మ? బ్రేకప్ వెనుక అసలు నిజం!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rashmika Mandanna Responds On Break Up With Rakshit Shetty

  సినీ పరిశ్రమలో హీరోయిన్లు మేనేజర్ల చేతిలో కీలుబొమ్మలని మీడియాలో తరుచుగా కనిపిస్తాయి. మేనేజర్లు లేకుండా హీరోయిన్లు సొంతంగా నిర్ణయం తీసుకోలేరని, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరని పలు సందర్భాల్లో వ్యక్తమయింది. గతంలో మహానటి సావిత్రి మేనేజర్ చేతిలో ఎలా మోసపోయిందనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. తాజాగా అదే పరిస్థితి కన్నడ భామ రష్మిక మందన్న ఎదురవుతుందట. మేనేజర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారనే విషయం టాలీవుడ్ మీడియాలో కీలకంగా మారింది. వివరాల్లోకి వెళితే..

  రష్మికను తప్పుదారి పట్టించి

  రష్మికను తప్పుదారి పట్టించి

  గీతా గోవిందం హీరోయిన్ రష్మిక మందన్న బ్రేకప్ వ్యవహారం టాలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలను కుదిపేసింది. ఆమె బ్రేకప్ వ్యవహారం వెనుక మేనేజర్లు కీలకంగా వ్యవహరించారనేది మీడియాలో వస్తున్న కథనాల సారాంశం. గీత గోవిందం సక్సెస్‌ను ఉదాహరణగా చూపించి పెళ్లి విషయంలో తప్పుదారి పట్టించారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది.

  గీత గోవిందం సక్సెస్ తర్వాత

  గీత గోవిందం సక్సెస్ తర్వాత

  ఛలో, గీత గోవిందం చిత్రాల కంటే ముందుగానే రష్మిక మందన్న నిశ్చితార్థం కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో జరిగింది. ఆ తర్వాత తెలుగులో వరుస సక్సెస్‌లు లభించాయి. గీత గోవిందం వంద కోట్ల విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నను పెళ్లి చేసుకోకుండా నిర్ణయం తీసుకోవడం సఫలమైనట్టు వార్తలు వస్తున్నాయి.

  రష్మికకు తప్పుడు సమాచారంతో

  రష్మికకు తప్పుడు సమాచారంతో

  గీత గోవిందం సక్సెస్‌ను చూపించి నీ కెరీర్ ఇక బ్రహ్మండంగా ఉండబోతుంది. పెళ్లి విషయంపై దృష్టిపెడితే కెరీర్ దెబ్బ తినడం ఖాయం. టాలీవుడ్‌లో నీ కెరీర్ బంపర్‌గా ఉంటుంది. కన్నడను వదిలేయ్ అని మేనేజర్ తప్పుడు సలహాలు ఇచ్చినట్టు సమాచారం. మేనేజర్ల మాటల ప్రభావంతో రష్మిక బ్రేకప్‌పై నిర్ణయం తీసుకొన్నదనే విషయం రచ్చ రచ్చగా మారింది.

  కాన్ఫిడెంట్‌గా రష్మిక మందన్న

  కాన్ఫిడెంట్‌గా రష్మిక మందన్న

  గీత గోవిందం విజయం రష్మిక మందన్న కాన్ఫిడెన్స్ పెంచిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఆ చిత్రం సక్సెస్‌తో మేనేజర్లు ఓవర్ కాన్ఫిడెంట్‌గా మారారు అనే విషయాన్ని చెప్పుకొంటున్నారు. ఇమేజ్ లేని రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవడం సరికాదు. ఇంకా పెద్ద స్టార్‌గా కావాలంటే మరో బిగ్ హిట్ ఖాతాలో పడాల్సిందే అని మేనేజర్లు ప్రభావితం చేసినట్టు పలు మీడియా కథనాల్లో కనిపించాయి.

   మేనేజర్ల ప్రభావం అంటూ కథనాలు

  మేనేజర్ల ప్రభావం అంటూ కథనాలు

  ప్రస్తుతం మేనేజర్లు తప్పుదారి పట్టిస్తున్నారనే విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ వ్యవహారం మీడియాలో రచ్చరచ్చగా మారుతున్నది. ఒకవేళ అలాంటి వార్తలో నిజముంటే మేనేజర్ల విషయంలో రష్మిక తగిన నిర్ణయం తీసుకొంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సావిత్రి, ఇతర తారల చేదు అనుభవాలను ఈ సందర్భంగ ఉదాహరణలుగా వెల్లడిస్తున్నారు. ఈ విషయంపై వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఓ మేనేజర్ అందుబాటులోకి రాలేకపోయారు.

  English summary
  Telugu actress going through the above phase is Tollywoods heartthrob ‘Rashmika Mandanna’. Recent news of her cancelling the engagement with the Kannada Star, cancelling signed Kannada movies to act in Telugu movies is as per the script given by her managers in Hyderabad.It is rumoured that they have suggested Rashmika will have a more decent career in Tollywood, had she cancel her engagement with the Kannada star. They are said to have suggested, the younger crowd would love her if she can cancel her engagement.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more