twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ హీరోయిన్‌తో రవిశాస్త్రి డేటింగ్.. సైఫ్ మాజీతో అఫైర్.. భార్యకు గుడ్‌బై చెప్పి..

    By Rajababu
    |

    Recommended Video

    Ravi Shastri Bowled Over By Bollywood Actress Nimrat Kaur

    ఇండియన్ మాజీ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డారు. గతంలో యువకుడిగా ఉన్న రోజుల్లో రవిశాస్త్రికి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎందరో అమ్మాయిలతో డేటింగ్ చేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. తాజాగా హీరోయిన్ నిమ్రత్ కౌర్‌తో జోరుగా డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

    భార్యకు రవిశాస్త్రి దూరం

    భార్యకు రవిశాస్త్రి దూరం

    వ్యక్తిగత విభేదాల కారణంగా రవిశాస్త్రి తన భార్య రీతూకు దూరంగా ఉంటున్నాడు. దశాబ్దకాలంగా వారిద్దరి కలపడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న రవిశాస్త్రి తాజాగా నిమ్రత్‌తో డేటింగ్‌లో ఉంటున్నట్టు సమాచారం.

     రెండేళ్లుగా నిమ్రత్‌తో డేటింగ్

    రెండేళ్లుగా నిమ్రత్‌తో డేటింగ్

    గత రెండేళ్లుగా నిమ్రత్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ పత్రికలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఆటోమొబైల్ బ్రాండ్ కోసం జరిగిన ఈవెంట్లు, ప్రమోషన్లు, షూట్లలో రవిశాస్త్రికి నిమ్రత్‌తో పరిచయం జరిగిందట.

    సైఫ్ మాజీ భార్యతో అఫైర్

    సైఫ్ మాజీ భార్యతో అఫైర్

    ఇండియన్ క్రికెట్ టీమ్‌కు 80వ దశకంలో రవిశాస్త్రి ఆడేటప్పుడు బాలీవుడ్ హీరోయిన్, సైఫ్ ఆలీ ఖాన్ మాజీ భార్య అమృతా సింగ్‌తో అఫైర్ నడిచింది. దాదాపు పెళ్లి పీటల వరకు వచ్చిన వారి అఫైర్ ఆ తర్వాత అర్ధాంతరంగా ముగిసింది.

    పాకిస్థాన్‌లో మ్యాచ్ సందర్భంగా

    పాకిస్థాన్‌లో మ్యాచ్ సందర్భంగా

    రవిశాస్త్రి, అమృతా సింగ్ మధ్య అఫైర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. ఇండియా, పాక్ మధ్య షార్జాలో మ్యాచ్ జరుగుతుంటే అమృతా సింగ్ ఆ మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లింది. ఆ మ్యాచ్‌లో పాక్‌ను భారత్ ఓడించడం, రవిశాస్త్రి హీరోగా మారడం జరిగింది. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తిందని పేర్కొంటారు.

    నిమ్రత్‌ కౌర్ బాలీవుడ్‌లోకి

    నిమ్రత్‌ కౌర్ బాలీవుడ్‌లోకి

    నిమ్రత్ కౌర్ 2004లో తెరా మెరా ప్యార్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ది లంచ్ బాక్స్, ఎయిర్‌లిఫ్ట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం నిమ్రత్ కౌర్ వెబ్‌సిరీస్ షూటింగులతో బిజీగా ఉన్నది. కాగా, రవిశాస్త్రి యూకేలో ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌లో బిజీగా ఉన్నారు.

    English summary
    Indian cricket team coach Ravi Shastri,is bowled over by Bollywood actress Nimrat Kaur. Reports suggest that Shastri, who is separated from his wife Ritu for a decade now, has fallen head-over-heels in love with Nimrat. The two have been dating discreetly for the last two years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X