రవితేజ 'నిప్పు' ఆరిపోయినట్లేనా?
రవితేజ, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపొందుతుందంటూ వార్తలు వచ్చిన నిప్పు చిత్రం ఆగిపోయినట్లే అని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. దానకి కారణం గుణశేఖర్ స్పీడు లేకపోవటం ఒకటైతే రవితేజ ఓవర్ స్పీడు మరొకటి అంటున్నారు. గుణశేఖర్ తన ప్లాపులను దృష్టిలో పెట్టుకుని కథపై రాత్రింబవళ్ళూ కసరత్తులు చేస్తూ స్క్రిప్టుని ఓ కొలిక్కి తేవటం లేదని చెప్తున్నారు.
మరో ప్రక్క వరసగా సినిమాలు చేస్తూ పోతున్న రవితేజ తన టైమ్ ని వీళ్ళెక్కడ వేస్ట్ చేస్తారో అన్నట్లు తన నెక్ట్స్ సినిమాలు శంఖం దర్శకుడు శివతోనూ, సీనియర్ దర్శకుడు వంశీతోనూ కమిట్ అవ్వటానికి ప్లాన్ చేస్తున్నాడు. మరో ప్రక్క వైవియస్ చౌదరి తన తాజా చిత్రానికి ఫైనాన్సియర్స్ వెతికే పనిలో ఉన్నారు. ఇలా నిప్పుకి ఎవరికి తోచినట్లు వారు నిప్పు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ప్రాజెక్టు మాత్రం ఆగదనే చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











