Just In
- 6 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 8 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 39 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ న్యూస్.. వైసీపీ ఎంపీ రియల్ స్టోరీతో రవితేజ కొత్త సినిమా.!
స్వయంకృషితో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఐదు పదుల వయసులోనే ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా చేసే రవితేజ.. ఈ మధ్య కొంచెం స్పీడు తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒకే ఒక్క సినిమాను చేస్తున్నాడు. అదే 'డిస్కోరాజా'. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరొక దానిని పట్టాలెక్కించేశాడు. తాజాగా ఈ సినిమాలోని రవితేజ పాత్రకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఎంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ స్వరకర్త. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో రానుంది. దీంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

హ్యాట్రిక్‌పై కన్నేసిన జోడీ
‘డిస్కోరాజా' తర్వాత రవితేజ.. గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘డాన్ శీను', ‘బలుపు' అనే హిట్ సినిమాలు వచ్చాయి. ఇక, ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసిన ఈ జంట.. ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో వస్తున్నారు. ‘క్రాక్' అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది.

లేడీ విలన్‌గా తమిళ నటి
ఇటీవల ఇందులో నటించబోయే మరో టాలెంటెడ్ నటి గురించి దర్శకుడు గోపీచంద్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశాడు. ఆమె మరెవరో కాదు.. తమిళ పరిశ్రమకు చెందిన వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమెను ఇందులో విలన్‌గా చూపించబోతున్నారని తెలుస్తోంది. వరలక్ష్మీ గతంలో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఆమె పలు చిత్రాల్లో విలన్‌గానూ కనిపించి మెప్పించింది. ఈ కారణంగానే చిత్ర యూనిట్ ఈమెను ఎంపిక చేసిందని తెలుస్తోంది.

వైసీపీ ఎంపీ కథతోనే సినిమా
ఈ సినిమాను ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న ఓ మాజీ పోలీస్ అధికారి రియల్ స్టోరీతో తెరకెక్కిస్తున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఆయన మరెవరో కాదు.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కదిరి సీఐగా పని చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో వివాదం కారణంగా ఈయన బాగా హైలైట్ అయ్యారు. రియల్ స్టోరీ అని చిత్ర యూనిట్ ప్రకటించడంతో ఆయన కథే అన్న టాక్ వినిపిస్తోంది.

నాలుక కోస్తానంటూ మీసం తిప్పాడు
వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమం వద్ద గ్రామస్థులకు, ఆయన శిష్యులకు మధ్య చెలరేగిన వివాదం అప్పట్లో సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో గ్రామస్థులకు మద్దతుగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం ఆందోళన చేపట్టడం.. ఈ సమయంలో ఆయన పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించడం చేశారు. దీంతో గోరంట్ల మాధవ్ ‘తమ సొంత మైలేజీ కోసం పోలీసులను చులకన చేసి మాట్లాడితే నాలుక కోస్తాం. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇదో అలవాటుగా మారింది' అంటూ మీసం తిప్పి మాట్లాడారు.

యూత్ ఐకాన్ అయిపోయారు
తానూ సీమ బిడ్డనేనంటూ తీవ్ర స్వరంతో అధికార పార్టీ ఎంపీకే సవాల్ విసరడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఎంపీపై ఇలా ఎదురుతిరిగి మాట్లాడడంతో ఆయన స్టార్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. జిల్లాలో ఆయనకు ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. యూత్ ఆయనను ఒక ఐకాన్‌గా చూశారు. దీని తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్.