చెల్లెలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్ రవితేజ..!?
రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ కాంబినేషన్ లో రూపొందిన 'శంభో శివ శంభో" చిత్రంలో రవితేజ చెల్లెలుగా అభినయ నటించింది. నిజంగానే డెఫ్ అండ్ డమ్ అయిన అభినయను వదిలిపెట్టనని, ఏదో ఒక సినిమాకి రికమెండ్ చేస్తూనే ఉంటానని అప్పట్లో రవితేజ చెప్పాడు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. కనీసం ఆమెను ఎవరికీ రికమండ్ చేయడంగానీ..తను నటించే సినిమాల్లో నటింపజేయడంగానీ చేయలేదు.
ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన 'సెవెన్త్ సెన్స్" చిత్రంలో భోది ధర్మ భార్యగా అభినయ నటించింది. ఈ సినిమా తర్వాత అయినా తనకు ఛాన్స్ లు వస్తే బాగుంటుందని, ఎవరైనా తనకు రికమెండ్ చేసి ఛాన్స్ లు ఇప్పిస్తే బాగుంటుందని అభినయ ఎదురుచూస్తోంది. మాంచి టాలెంట్ ఆర్టిస్ట్ అయిన అభినయకు దర్శక నిర్మాతలు ఛాన్స్ ఇచ్చి ఆదరిస్తే బెటర్ అని పరిశీలకులు అంటున్నారు.
abhinaya ravi teja seventh sense shruti hassan shambo siva shambo అభినయ రవితేజ సెవెన్త్ సెన్స్ సూర్య శృతిహాసన్ శంభో శివ శంభో


Click it and Unblock the Notifications