బాలయ్య బాబుపై ఎస్ ఎమ్ ఎస్ లు జోకులు పంపిస్తుంది ఆహీరోయేనా..
ఈ మధ్య కాలంలో హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ పై సెల్ ఫోన్స్‌లో ఎస్ ఎమ్ ఎస్‌లు స్వైరవిహారం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. సాధారణంగా ఇలాంటి జోకులన్నీ సర్దార్జీ పై రాస్తుంటారు. కానీ సర్దార్జీ పై రాసిన జోకులన్ని ఇప్పుడు బాలకృష్ణకు అన్వయించి ఎస్ ఎమ్ ఎస్ లను పంపిస్తున్నారు. సింహ హిట్ తర్వాత కొన్ని రోజులు ఈ సందేశాల జోరు ఆగింది. కానీ దాసరి, బాలయ్య బాబుల పరమవీరచక్ర ప్లాఫ్ అవ్వడంతో మళ్శీ వాటి జోరు పెరిగిందని సమాచారం.
అయితే ఇప్పుడు బాలకృష్ణ పేరు పక్కన జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా జత చేసి పంపిస్తున్నారు అందరు. అయితే సోమవారం హైదరాబాద్ లో జరిగిన పరమవీరచక్ర సక్సెస్ మీట్ లో ఈ ఎస్ ఎమ్ ఎస్ లపై దాసరి విడుచుకుపడ్డాడు. బాలయ్య పై ఇండస్ట్రీలో ఎవరో గిట్టని వారె ఇలా ఎస్ ఎమ్ ఎస్ క్రియేట్ చేస్తున్నారు. ఇకనైనా వాటిని ఆపేయాలని హెచ్చరించాడు, కానీ అక్కడ వున్న మీడియా వాళ్శందరూ బాలయ్య పై ఈ ఎస్ ఎమ్ ఎస్ జోకులు క్రియేట్ చేస్తుంది హీరో రవితేజ అయి ఉండవచ్చునని వారియొక్క అనుమానాన్ని వెలిబుచ్చడం జరిగింది.
దీనికి కారణం లేకపోలేదు గతంలో బాలయ్య మీరా జాస్మిన్ విషయంలో రవితేజను కొట్టాడనే పుకారు వుంది. దానికి ప్రతీకారంగానే ఈ ఎస్ ఎమ్ ఎస్‌ల గోల రవితేజ చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











