మమితా బైజూ, కాయదు లోహర్‌పై మనసు పడుతున్న మాస్ హీరో!
ఈ మధ్య కాలంలోనే సౌత్ సినిమా దగ్గర చాలా మంది యంగ్ హీరోయిన్స్ పరిచయం అయ్యారు. కాగా ఇలా వచ్చిన వారిలో కొందరు హీరోయిన్స్ తమ ఫస్ట్ సినిమా తోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిస్తే మరి కొందరు సడెన్ గా రైజ్ అయ్యినవారు కూడా ఉన్నారు. అప్పుడు వరకు పలు సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమా చాలు ఆడియెన్స్ లో మెయిన్ గా యూత్ ని అట్రాక్ట్ చెయ్యడానికి.
ఇలా గత రెండేళ్లలో నార్త్ టు సౌత్ వరకు చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యారు. ఇక ఇలా కావడంతో వారికి వరుస ఆఫర్స్ కూడా రావడం మొదలవుతున్నాయి. కాగా ఇలా కొత్త హీరోయిన్స్ ఎవరైనా దృష్టిలో పడితే వారు మాస్ మహారాజ రవితేజ సినిమాలో ఉండాల్సిందే అన్నట్టుగా పలు ట్రోల్స్ తనపై రావడం కూడా స్టార్ట్ అయ్యాయి.
అయితే నిజానికి రవితేజ చాలా మంది యువ దర్శకులని తెలుగు సినిమాకి పరిచయం చేయడమే కాకుండా కొత్త హీరోయిన్స్ ని కూడా చాలా మందిని తాను పరిచయం చేశారు. కానీ అది వదిలేసి తనపై ఈ తరహా ట్రోల్స్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. కాగా ఇలానే గత కొన్ని రోజులు కితం తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ లో కూడా ఓ రేంజ్ లో సెన్సేషన్ గా మారిపోయిన యంగ్ బ్యూటీ కాయదు లోహర్ కోసం అందరికీ తెలిసిందే.
కాగా ఈమె పేరు ఇంతలా సెన్సేషన్ అవుతూ ఉంటే చాలా మంది ఈమె రవితేజతో మాత్రం నటించకూడదు అని కోరుకున్న వారు కూడా లేకపోలేరు. కానీ ఇపుడు సీన్ కట్ చేస్తే రవితేజ నెక్స్ట్ సినిమాకి ఈమె లాక్ అయ్యినట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈమె మాత్రమే కాదు కాయదు ఈ ఏడాదిలో సెన్సేషన్ అయితే గత ఏడాది సెన్సేషన్ అయ్యిన మరో బ్యూటీ కూడా రవితేజ సినిమాలో కనిపిస్తుంది అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలకి కాయదు లోహర్ సౌత్ యువతలో ఎలా అయితే సంచలనం రేపిందో గత ఏడాది కూడా ఇదే ఫిబ్రవరిలో మరో హీరోయిన్ కూడా అంతకు మించే హాట్ టాపిక్ అయ్యింది. మరి ఆ హీరోయిన్ ఎవరో కూడా కాదు మలయాళ యంగ్ హీరోయిన్ మమిత బైజు. ప్రేమలు అనే సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మమిత మారిపోయింది.
మరి అనూహ్యంగా ఈ ఇద్దరు సెన్సేషనల్ బ్యూటీస్ రవితేజ నెక్స్ట్ సినిమాలో కనిపిస్తారని ఇపుడు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా ఇపుడు రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. నెక్స్ట్ సినిమాగా నేను శైలజ, చిత్ర లహరి, రెడ్ సినిమాల దర్శకుడు తిరుమల కిషోర్ తో చేయనున్నారు. కాగా ఈ సినిమాలోనే ఆ హీరోయిన్స్ లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి నిజంగానే ఈ ఇద్దరూ సినిమాలో ఉన్నారో లేదో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











