Oscars 2023 రాజమౌళి టీమ్‌కు అధికారిక ఆహ్వానం రాలేదా? ఆస్కార్ వేడుకకు టిక్కెట్లు కొని వెళ్లారా?
ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రానికి ఆస్కార్ వేదికపై అపూర్వ గౌరవం దక్కింది. కీరవాణి సంగీతం అందించిన నాటు నాటు పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఇద్దరు అగ్ర హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్‌తో స్టెప్పులే వేయించారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన నాటు నాటు పాటను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ వరించింది. అయితే ఈ వేడుకు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు RRR మొత్తానికి అధికారికంగా ఆహ్వానం అందలేదు. కేవలం కీరవాణి, చంద్రబోస్‌కు మాత్రమే అధికారికంగా ఆహ్వానం అందింది. ఆ ఇద్దరిని మాత్రమే అధికారికంగా ఆహ్వానించి.. వారిని లోనికి ప్రవేశం కల్పించారు. మిగితా RRR యూనిట్ సభ్యులందరూ డబ్బలు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసి లోనికి వెళ్లారు అనే విషయం సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నది.

ఆస్కార్ అవార్డుల వేడుకలో రాజమౌళి కుటుంబం, ఎన్టీఆర్, రాంచరణ్, ఉపాసన తదితరులు పాల్గొన్నారు. వీరందరికి చివరి వరుసలో సీట్లు కేటాయించారు. ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు ఒక్కొక్కరు 25 వేల అమెరికన్ డాలర్లు అంటే.. ఒక్కో టికెట్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించి..ఈ వేడుకలో భాగమయ్యారు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఆస్కార్ అవార్డుల విషయంలో దర్శకుడు రాజమౌళి టీమ్ దాదాపు 80 కోట్లకుపైగా ఖర్చు చేసిందని సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెను దుమారం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఆ రేంజ్ ఖర్చుకు ఇది కూడా ఓ కారణమై ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా భారత్‌కు రాజమౌళి ఆస్కార్ సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించారని మరో వర్గం అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications











