మెగా మేనల్లుడి పెళ్లికి మామయ్యలు బ్రేక్.. పెళ్లి కూతురు రూమర్లకు మెగా ఫ్యామిలీ చెక్!

మెగా ఫ్యామిలీలో మేనల్లుడి పెళ్లి విషయం అత్యంత ప్రాధాన్యంగా మారింది. మీడియాలో వస్తున్న రూమర్లకు చెక్ చెప్పే విధంగా సాయిధరమ్ తేజ్ పెళ్లికి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే గత కొద్ది నెలలుగా మెగా ఫ్యామిలీని అనేక శుభవార్తలు సంతోషంలో ముంచెత్తుతున్నాయి. అయితే మేనల్లుడి పెళ్లి వ్యవహారంపై కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మామయ్యలు ఓ నిర్ణయం తీసుకొన్నారనే విషయం ఆసక్తిని రేపింది. సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై వస్తున్న వార్తలు, మెగా ఫ్యామిలీ ఖండించిన వివరాల్లోకి వెళితే..

సాయిధరమ్ తేజ్ కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. విరూపాక్ష బ్లాక్ బస్టర్ సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. యాక్సిడెంట్ తర్వాత నాకు కొన్ని హెల్త్ సమస్యలు వెంటాడుతున్నాయి. వాటి కోసం నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అనుకొంటున్నాను. కాబట్టి కొంత గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తాను అని అన్నారు.

Is Sai Dharam Tej following Pawan Kalyan s advice for his Marriage

అయితే ఈ క్రమంలో మెగా మేనల్లుడి పెళ్లి విషయంపై చర్చలు జరిగాయి. అయితే వివాహం జరిపించే విషయంలో మెగా ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకొన్నది. అయితే ప్రస్తుతం చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరు తమ తమ ప్రొఫెషన్స్‌లో బిజీగా ఉన్నారు. కాబట్టి వారి వెసలుబాటును చూసుకొని ముహుర్తాలు పెట్టాలని ఫ్యామిలీ నిర్ణయం తీసుకొన్నట్టు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

అయితే సాయిధరమ్ విషయంలో మెగా ఫ్యామిలీ కొన్ని సూచనలు చేశారు. హెల్త్ విషయంలో జాగ్రత్లలు, ట్రీట్‌మెంట్ కొనసాగించడంపై ముందు దృష్టిపెట్టాలని చెప్పారట. అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటు సమయంలో మేనమామ కూడా సమయం వెచ్చించలేని పరిస్థితుల్లో పెళ్లి నిర్ణయాన్ని మేనల్లుడు కొంత వాయిదా వేసుకొన్నారని తెలుస్తున్నది.

Is Sai Dharam Tej following Pawan Kalyan s advice for his Marriage

అయితే మీడియాలో వస్తున్న వార్తలను మెగా పీఆర్ వర్గాలు ఖండించాయి. హీరోయిన్‌తో పెళ్లి అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే అధికారికంగా వెల్లడిస్తాం. అంతేకానీ అవాస్తవాలను ప్రచారం చేయవద్దని వెల్లడించారు. సాయిధరమ్ తేజ్‌పై రూమర్లు రాయవద్దని సూచించారు.

ఇదిలా ఉండగా, సాయిధరమ్ తేజ్ ఓ భారీ ప్రాజెక్టుకు సిద్దమవుతున్నారు. హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించే పాన్ ఇండియా సినిమాలో ఆయన నటించనున్నారు. ఆగస్టులో ప్రారంభమయ్యే ఈ సినిమా షూట్ సుమారుగా 1 సంవత్సరంపాటు ప్రొడక్ష‌న్‌లో ఉంటుందని నిర్మాతలు ఇటీవల చెప్పారు. వచ్చే ఏడాది అంటే.. 2025లో మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X