మళ్లీ సాయి ధరమ్ తేజ్ పెళ్లి లొల్లి.. ఆ హీరోయిన్‌తోనేనట..
సినిమా ఇండస్ట్రీలో రూమర్లు, గాసిప్స్ ముందు పుట్టి వార్తలు తర్వాత పుడుతాయి. ఇక హీరో, హీరోయిన్ల ఆఫైర్ల విషయంలో హద్దు అదుపు ఉండదు. ఇద్దరు కలిసి రెండు, మూడు చిత్రాల్లో నటించారంటే చాలు.. ఇక వారి మధ్య రిలేష
Recommended Video

సినిమా ఇండస్ట్రీలో రూమర్లు, గాసిప్స్ ముందు పుట్టి వార్తలు తర్వాత పుడుతాయి. ఇక హీరో, హీరోయిన్ల ఆఫైర్ల విషయంలో హద్దు అదుపు ఉండదు. ఇద్దరు కలిసి రెండు, మూడు చిత్రాల్లో నటించారంటే చాలు.. ఇక వారి మధ్య రిలేషన్, అఫైర్ అంటూ రూమర్లు విస్తృతంగా ప్రచారం అవుతుంటాయి. ఇందుకు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ అతీతుడేమీ కాదు.
ఇటీవల కాలంలో తనతో వరుస చిత్రాల్లో నటించిన హీరోయిన్‌తో పెళ్లి అంటూ తాజాగా ఓ వార్త వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నది. అయితే తాజా వార్తలో పెళ్లి ఫిక్స్ అంటూ ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. అందులో వాస్తవం ఎంత ఉందనే విషయంపై సాయిధరమ్ తేజ్ స్పందిస్తే తప్ప అసలు విషయం బయటపడదు.

జవాన్‌గా ప్రేక్షకుల ముందుకు
సాయిధరమ్ తేజ్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. సరైన కథలకు పచ్చజెండా ఊపుతూ వరుస విజయాలను సొంతం చేసుకొంటున్నాడు. ప్రస్తుతం జవాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

రెజీనా ప్రేమలో సాయి ధరమ్
అయితే పిల్లా నీవు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో రెజీనా కసాండ్రా, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. ఆ సమయంలో జరిగిన పరిచయం స్నేహంగా.. అక్కడి నుంచి ప్రేమలో పడినట్టు రూమర్లు వచ్చాయి.

రెజీనాతో ప్రేమ విషయాన్ని
రెజీనాతో ప్రేమ విషయాన్ని సాయిధరమ్ తన కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించారనే నిరాధారమైన వార్త ఒకటి మీడియాలో నానింది. అయితే రెజీనాతో సాయితో పెళ్లికి విముఖత చూపించిందని కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాను. పెళ్లి గురించి ఆలోచన లేదని రెజీనా చెప్పినట్టు సమాచారం.

సాయి ధరమ్ నాకు ఫ్రెండ్
ఆ తర్వాత పెళ్లి వార్తలు ఊపందుకోవడంతో తమ మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్, రెజీనా. సాయి ధరమ్ తేజ్ నాకు మంచి మిత్రుడు మాత్రమేనని అప్పట్లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా పేర్కొన్నది. అంతటితో ఆ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు పడుతుందని అందరూ ఆశించారు.

మళ్లీ సడెన్‌గా పెళ్లి వార్త
అయితే సమంత, నాగచైతన్య పెళ్లి తర్వాత సడన్‌గా సాయి ధరమ్ తేజ్, రెజీనా పెళ్లి ఫిక్స్ అయిందంటూ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈ వార్తలో ఎంత నిజమున్నదో అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ అదే నిజమైతే టాలీవుడ్‌లో మరో స్టార్ జంట ఒక్కటవ్వడం ఖాయమన్న మాట.


Click it and Unblock the Notifications











