షారుక్ ఖాన్ కొడుకుతో తెలుగు యాక్టర్ డేటింగ్.. ఆర్యన్‌తో పీకల్లోతు అఫైర్‌లో సాయిధరమ్ తేజ్ హీరోయిన్!
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి జాతీయ మీడియా హెడ్‌లైన్స్ ఆకర్షించారు. డ్రగ్స్ కేసులో సంచలన రీతిలో మీడియాలో ఆయన పేరు మీడియాలో కొద్దివారాలపాటు మార్మోగింది. ఆ తర్వాత ఆయన మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆర్యన్ తెలుగు హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరనే వివరాల్లోకి వెళితే..
లారీస్సా బోనేసే పేరు మీరు వినే ఉండి ఉంటారు. కానీ ఆమె పేరు చెబితే అంతగా గుర్తుండకపోవచ్చు. సాయిధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమా హీరోయిన్ అంటే మీకు ఫర్‌ఫెక్ట్ తెలుస్తుంది. లారీస్సా భోనేసే గురించి చెప్పాలంటే.. రెండు తెలుగు సినిమాల్లో నటించింది. మొత్తంగా తన కెరీర్‌లో 6 సినిమాల్లో మాత్రమే నటించి మెప్పించే ప్రయత్నం చేసింది.

బ్రెజిల్ దేశానికి చెందిన లారీస్సా బోనేసే ఇండియాలో నటిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే బాగంగా గో గోవా గాన్ అనే హిందీ సినిమా ద్వారా నటిగా మారింది. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ తిక్క చిత్రంలో అంజలి పాత్రలో, అలాగే నెక్ట్స్ ఏంటి? చిత్రంలో రోహిణిగా ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.
తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో మరోసారి పెంట్ హౌస్ అనే హిందీ చిత్రంలో నటించింది. ఆ సినిమా కూడా పెద్దగా గుర్తింపును ఇవ్వకపోవడంతో యాక్టింగ్‌కు కొంతకాలంగా దూరంగా ఉంటున్నది. ఆ తర్వాత కొన్ని మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆ వీడియో ఆల్బమ్స్ కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేకపోవడంతో దాదాపు మీడియా లైమ్ లైట్‌కు దూరంగా ఉండిపోయింది.

అయితే తాజాగా ఆర్యన్ ఖాన్‌తో డేటింగ్ చేస్తుందనే వార్తతో మరోసారి లారీస్సా బోనేసే పేరు మీడియాలో హైలెట్ అయింది. కొంతకాలంగా షారుక్ కొడుకుతో శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తున్నదనే వార్త వైరల్ అయింది. అయితే వారిద్దరి మధ్య అఫైర్, డేటింగ్ విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
అయితే మీడియాలో వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో అటు ఆర్యన్ ఖాన్ గానీ.. ఇటు లారీస్సా బోనేసే గానీ స్పందించకపోవడంతో నిజంగా వారిద్దరి మధ్య అలాంటి బంధం ఉందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎలాంటి పాపులారిటీ లారీస్సాతో ఆర్యన్ ఖాన్ డేటింగ్ విషయం ఆమెకు మంచి పాపులారిటీని సంపాదించి పెట్టింది. వారి డేటింగ్ వ్యవహారం గురించి కొద్ది రోజుల ఆగితే అసలు విషయం తెలియడం ఖాయం.


Click it and Unblock the Notifications











