Sai Pallavi: సాయి పల్లవి సంచలన నిర్ణయం.. తొలిసారి రొమాంటిక్ హీరోకి గ్రీన్ సిగ్నల్..!

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. తన అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగింది. కేవలం తెలుగు ప్రేక్షకుల మదిలోనే పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు. వరుస విజయాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. యూత్‌లో సాయి పల్లవి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి ఓ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా తన కెరీర్ తొలిసారి ఓ రొమాంటిక్ హీరో సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట.

న్యాచులర్ బ్యూటీ సాయి పల్లవి మలయాళంలో 'ప్రేమమ్' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన అద్భుత నటన, డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది.ఆ సినిమా ఫేమ్ తో దుల్కర్ సల్మాన్ తో 'కాళి' సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో ఈ అమ్మడు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాను తెలుగులో 'హే పిల్లగాడా' పేరుతో డబ్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్ కూడా అడుగుపెట్టే అవకాశం అందుకుంది. ఇలా డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Is Sai Pallavi Acting With Simbu In This New Film STR 49

ఈ సినిమాలో సాయిపల్లవి 'భానుమతి' అనే తెలంగాణ పిల్ల క్యారెక్టర్ నటించింది. భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను ఫుల్ 'ఫిదా' చేసేసింది. అలాగే తన నటన, కట్టు, బొట్టుతో అందరినీ మెప్పించింది. ఆమెను సావిత్రి, సౌందర్యలతో పొల్చేస్తున్నారు. ఇలా యూత్‌లో సాయి పల్లవి క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటించే అవకాశం కొట్టిసిందే. అలా శ్యామ్ సింగ రాయ్, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. వరుస హిట్ అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా మారింది. సాయి పల్లవి నటించిన అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ లు కొట్టింది.

ఇక గత ఏడాది మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'అమరన్'(Amaran) సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడంతో పాటు సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'తండేల్' (Thandel) సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లు అందుకుంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి.. 'రామాయణ' అనే భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.

Is Sai Pallavi Acting With Simbu In This New Film STR 49

ఇదిలా ఉంటే.. సాయి పల్లవి తాజాగా మరో భారీ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న 'STR-49'లో
సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్నట్లు టాక్. రాజ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తుండగా.. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై.. శరవేగంగా జరుగుతుందట. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే.. హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మనోడు నటించే సినిమాల్లో హీరోయిన్లతో లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. అంతేకాకుండా.. శింభు తనతో నటించే హీరోయిన్స్‌తో రిలేషన్ కొనసాగిస్తారనే ప్రచారం కూడా ఇండస్ట్రీ ఉంది. అలాంటి హీరోతో నటించడానికి సాయి పల్లవి ఎలా ఓకే చెప్పింది. అసలు ఆ సినిమాకు ఎందుకు ఒప్పుకుందంటూ ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సాయి పల్లవి నిర్ణయం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రను ఎలా డిజైన్ చేశారో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Read more about: sai pallavi simbu str 49
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X