తెలుగులో క్రేజీ ఆఫర్ అందుకున్న సాయి పల్లవి? ఆ బ్యాక్‌డ్రాప్ వర్కౌట్ అయ్యేనా?
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరు హీరోయిన్స్ తమ ప్రొఫెషన్ పరంగా ఒకేలా ఉండరని చెప్పాలి. ఒకో హీరోయిన్ ఒకో స్టేచర్‌ని మైంటైన్ చేస్తూ తమ శైలిలో సినిమాలు చేస్తూ వెళుతుంటారు. అయితే కొందరు మాత్రం ఎక్స్ పోజింగ్ స్కిన్ షోస్ లాంటివి చేసి మరీ స్టార్ హీరోయిన్స్ అవుతారు. కానీ ఇంకొందరు మాత్రం అవేవి లేకుండా కేవలం తమ పెర్ఫామెన్స్ లుక్స్ తో మాత్రమే అలరిస్తూ స్టార్‌డమ్ సంపాదించుకుంటారు.
వీరిలో రెండో క్యాటగిరీకి చెందిన హీరోయిన్స్ లో ప్రెజెంట్ ఉన్న తరంలో వినిపించే పేరు సాయి పల్లవి అని చెప్పొచ్చు. మలయాళ సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో తన మొదటి సినిమాకే సంచలన విజయాన్ని అందుకుని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. అక్కడి నుంచి సాయి పల్లవి సెలెక్టెడ్ గానే సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతోంది.

అయితే సాయి పల్లవి తెలుగులో చేసిన అన్ని చిత్రాల్లో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర విఫలం అయ్యాయి. కానీ అందులో తన రోల్ కి ఇంపార్టెన్స్ కానీ, తన రోల్‌లో ఆమె పెర్ఫామెన్స్ లకి కానీ ఎక్కువ మార్కులే పడ్డాయి. కాగా సాయి పల్లవి తెలుగులో చేసిన అన్ని సినిమాల్లో తెలంగాణ బ్యాక్ డ్రాప్ చేసే సినిమాలకి ఒక ట్రాక్ రికార్డు ఉందని చెప్పొచ్చు.
తన మొదటి సినిమా "ఫిదా" తోనే అంత క్రేజ్ రావడానికి తన సొంత డబ్బింగ్ లో తెలంగాణా యాసను అచ్చు అక్కడి అమ్మయిలానే పలికించడం గట్టి కారణం అని విశ్లేషకులు అంటూ ఉంటారు. ఈ కోవలోనే వచ్చిన నెక్స్ట్ రెండు సినిమాలు లవ్ స్టోరీ ఆ తర్వాత విరాట పర్వంలలో లవ్ స్టోరీ హిట్ అయ్యింది. విరాట పర్వం కంటెంట్ బాగున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీనితో మళ్ళీ అక్కడి నుంచి ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలను సాయి పల్లవి టచ్ చేయలేదు.

అయితే ఫైనల్ గా సాయి పల్లవి మళ్ళీ ఇదే నేపథ్యంలో సినిమా ఓకే చేసినట్టుగా ఫిలింనగర్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ కథనాల ప్రకారం సాయి పల్లవి దగ్గరికి సాలిడ్ స్క్రిప్ట్ వెళ్లిందట. ఆ సినిమా ఎవరితోనో కాదు తెలంగాణ నేపథ్యంలో అద్భుతమైన ఎమోషనల్ హిట్ ఇచ్చిన బలగం ఫేమ్ వేణు యెల్దండి రాసుకున్న మరో చిత్రం "ఎల్లమ్మ" అని తెలుస్తుంది. ఈ సబ్జెక్టుకి సాయి పల్లవి కరెక్ట్ అని మేకర్స్ అనుకుంటున్నారట.
దీనితో ఈమెని అప్రోచ్ కాగా తన రోల్ సినిమాలో చాలా స్ట్రాంగ్ అని తెలిసే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది కానీ నిజం అయితే తెలుగులో సాయి పల్లవి తెలంగాణ నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నట్టే అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ గా తనకి ఈ నేపథ్యంలో వచ్చిన అన్ని సినిమాల్లో తనదే మెయిన్ లీడ్ . మరి బలగం వేణు.. సాయి పల్లవిని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











